News January 22, 2025
పెద్దపల్లి: కాంట్రాక్ట్ ప్రాతిపదికన గైనకాలజిస్ట్ పోస్టులకు ఆహ్వానం

కాంట్రాక్ట్ గైనకాలజిస్ట్ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంథని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు ఖాళీగా ఉన్న గైనకాలజిస్ట్ పోస్టును కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు దరఖాస్తులను బయోడేటా తో పాటు జిల్లా ఆసుపత్రి నందు అందించాలని వివరాలకు 8499061999 నెంబర్‌ను సంప్రదించాలని డీసీహెచ్‌వో ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
Similar News
News February 12, 2025
కోయిలకొండ: కరెంట్ షాక్ తగిలి వ్యక్తికి తీవ్ర గాయాలు

కరెంట్ పని చేస్తుండగా.. ఓ వ్యక్తికి షాక్ తగిలిన ఘటన బిజినేపల్లిలో చోటచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. కోయిలకొండ మండలం లింగుపల్లి గ్రామానికి చెందిన బాబు(38) బిజినేపల్లిలో కరెంటు పని చేస్తుండగా ఒక్కసారిగా షాక్ తగిలి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబసభ్యులు ఓ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి తీవ్రంగా ఉండడంతో అక్కడి నుంచి HYDకి పంపించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 12, 2025
‘లైలా’ రన్ టైమ్ ఎంతంటే?

‘లైలా’ మూవీకి సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ సినిమా రన్ టైమ్ ఎండింగ్ కార్డ్స్‌తో కలుపుకొని 2 గంటల 16 నిమిషాలు ఉన్నట్లు మూవీ వర్గాలు పేర్కొన్నాయి. విశ్వక్ సేన్, ఆకాంక్ష ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఎల్లుండి థియేటర్లలో విడుదల కానుంది. ఇటీవల కమెడియన్ <<15413032>>పృథ్వీ చేసిన వ్యాఖ్యలతో<<>> ఈ మూవీ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
News February 12, 2025
HYD: ఈ నెల 17వరకు నుమాయిష్ పొడిగింపు

HYD నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరుగుతున్న నుమాయిష్ జనవరి 3వ తేదీన ప్రారంభమైంది. నుమాయిష్‌ను సందర్శించేందుకు భారీగా సందర్శకులు తరలివస్తున్నారు. సందర్శకులు భారీగా తరలివస్తుండడంతో పోలీసులు భద్రత కారణాల దృష్ట్యా మొదటగా ఈనెల 15వ తేదీ వరకు అనుమతి ఇస్తామని HYD సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. అనంతరం ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యుల వినతి మేరకు ఈనెల 17 వరకు అనుమతి లభించినట్లు సొసైటీ సభ్యులు తెలిపారు.