News June 7, 2024
పెద్దపల్లి: కూలర్ రిపేర్ చేస్తుండగా కరెంట్ షాక్.. ఒకరి మృతి

పెద్దపల్లి జిల్లాలో గురువారం రాత్రి కరెంట్ షాక్‌తో ఓ వ్యక్తి మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం.. ఓదెల మండలం జీలకుంట గ్రామానికి చెందిన రైతు నల్ల శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో కూలర్ రిపేర్ చేస్తుండగా కరెంట్ షాక్‌కు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. శ్రీనివాస్ రెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
Similar News
News February 11, 2025
పెద్దపల్లి: ఇద్దరు మేకల దొంగల అరెస్ట్

కాల్వశ్రీరాంపూర్, మల్యాలలో మేకలు దొంగతనం చేసిన చొప్పదండికి చెందిన మనుపతి సంజీవ్‌కుమార్, కమాన్‌పూర్ మండలం పెంచకల్‌పేటకు చెందిన శివరాత్రి రమేశ్‌లను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్‌ఐ వెంకటేశ్ తెలిపారు. వీరు జల్సాలకు అలవాటుపడి దొంగతనాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ నెల 2న కాల్వశ్రీరాంపూర్‌కు చెందిన టీ.కొమురయ్య 3, మల్యాలకు చెందిన బీ.రాజయ్య 2 మేకలను దొంగతనం చేశారని ఎస్‌ఐ తెలిపారు.
News February 11, 2025
కాశీలో రాజన్న సిరిసిల్ల జిల్లా వాసి మృతి

కోనరావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన కదిరే శ్రీనివాస్ గౌడ్ (45) కాశీలో మృతి చెందాడు. కుటుంబసభ్యులు వివరాల ప్రకారం.. 4 రోజుల క్రితం మిత్రులతో కలిసి ప్రయాగ్ రాజ్ లోని కుంభమేళాకు వెళ్లారు. తరువాత అయోధ్య రామమందిరాన్ని దర్శించుకొని ఆదివారం కాశీకి వెళ్లారు. కాశీలో దర్శనం కోసం క్యూ లైన్లో వేచి ఉండగా స్పృహతప్పి కిందపడ్డాడు. స్నేహితులు హాస్పిటల్ కు తరలించారు. వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు.
News February 11, 2025
రేపే మేడారం జాతర..!

మేడారం సమ్మక్క-సారలమ్మ మినీ జాతరకు ఒక్క రోజే మిగిలి ఉంది. రేపటి నుంచి 15 వరకు జాతర వైభవంగా జరగనుంది. ఇప్పటికే వేల సంఖ్యలో భక్తులు అమ్మవార్లకు ముందస్తు మొక్కులు చెల్లిస్తున్నారు. TG నుంచి మాత్రమే కాకుండా.. AP, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి సైతం భక్తులు ఇక్కడికి వస్తుండటం విశేషం. భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మీరూ వనదేవతల జాతరకు వెళ్తున్నట్లైతే కామెంట్‌లో తెలపండి.