News January 25, 2025
పెద్దపల్లి: గణతంత్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమైన కలెక్టరేట్

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకలకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈ వేడుకల్లో నూతనంగా 4పథకాల అమలు కార్యక్రమానికి ప్రభుత్వం స్వీకారం చుట్టడంతో అధికారులు లబ్ధిదారుల ఎంపిక ఆన్లైన్లో నమోదు కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. రేపు ఉదయం 9గంటలకు కలెక్టర్ కోయ శ్రీహర్షతో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుందని.. దీనికి జిల్లాలోని ప్రజలు హాజరవ్వాలని అధికారులు కోరారు.
Similar News
News March 14, 2025
ఢిల్లీ నుంచి ఒక్క రూపాయీ తేలేదు: KTR

TG: సీఎం రేవంత్ 39 సార్లు ఢిల్లీ వెళ్లి మీడియా ముందు సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారని, కానీ అక్కడి నుంచి రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా తేలేదని KTR విమర్శించారు. ‘ ఓటేసి మోసపోయాం అని జనం చివాట్లు పెడుతుంటే ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నావ్. నీళ్లు లేక పంటలు ఎండిపోతే కనీసం సాగునీళ్లపై సమీక్ష కూడా లేదు. హామీల అమలు చేతగాక గాలి మాటలు, గబ్బు కూతలు. జాగో తెలంగాణ జాగో’ అని ట్వీట్ చేశారు.
News March 14, 2025
BREAKING: ఆదిలాబాద్: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

హోలీ పండుగ వేళ ఆదిలాబాద్‌లో విషాదం జరిగింది. పట్టణంలోని ఎరోడ్రం సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ పై వెళుతుండగా ఇద్దరు కిందపడినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే వారిని రిమ్స్‌కు తరలించారు. ఈ ప్రమాదంలో రిషి కుమార్ అనే యువకుడు మృతిచెందగా.. మరో యువకుడు ప్రేమ్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఘటనా స్థలాన్ని సీఐ సునీల్ కుమార్ సందర్శించి దర్యాప్తు చేపడుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News March 14, 2025
‘పశు బీమాను సద్వినియోగం చేసుకోవాలి’

పశు బీమాను పాడిరైతులు సద్వినియోగం చేసుకోవాలని పశుసంవర్థకశాఖ జిల్లా అధికారి రామ్మోహన్రావు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పశువులకు 80శాతం రాయితీతో బీమా అందిస్తున్నాయన్నారు. తెల్ల రేషన్ కార్డున్న పాడి రైతులంతా ఈ బీమాను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రెండేళ్ల కాలంలో 10,231 పశువులకు బీమా చేయగా, మృతి చెందిన 179 పశువులకు మంజూరైన రూ.52,98,000 బీమా నగదును రైతుల ఖాతాల్లో జమ చేసామన్నారు.