News March 23, 2025
పెద్దపల్లి: గీత ఐస్ క్రీమ్.. ఓ మధుర జ్ఞాపకం

ఎండాకాలం వచ్చిందంటే చాలు.. ఆ రోజుల్లో గీత ఐస్ క్రీమ్ లేకుండా కాలం గడిచేది కాదు. ఒక్క రూపాయికి మాత్రమే లభించే గీత ఐస్ క్రీమ్, పాల ఐస్ క్రీమ్, పెప్సీ ఐస్ క్రీమ్లు ప్రస్తుత రోజుల్లో మధుర జ్ఞాపకంగా మారిపోయాయి. వందల రూపాయలు పెట్టి ఐస్ క్రీములు తిన్నప్పటికీ గీత ఐస్ క్రీమ్ మర్చిపోలేమని ఇప్పటికీ ఆ మాటలు వినిపిస్తూనే ఉంటాయి. మీ చిన్నతనంలో గీత ఐస్ క్రీమ్ తిన్నారా? తింటే.. కింద కామెంట్ చేయండి..!
Similar News
News November 19, 2025
22న హనుమకొండలో జాబ్ మేళా

ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఈనెల 22న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి శాఖ అధికారి మల్లయ్య తెలిపారు. సుమారు 60 ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ఈ మేళాను చేపట్టారు. ఎస్సెస్సీ (SSC), డిగ్రీ చదివి, 18 నుంచి 35 సంవత్సరాలలోపు ఉన్న యువతీ యువకులు ధ్రువీకరణ పత్రాలతో ములుగు రోడ్డులోని కార్యాలయంలో హాజరుకావాలని ఆయన సూచించారు.
News November 19, 2025
మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలు: నిర్మల్ కలెక్టర్

జిల్లాలో అర్హులైన మహిళలందరికీ ఇందిరా మహిళా శక్తి చీరలు అందిస్తామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. బుధవారం చీరల పంపిణీపై సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన వీసీలో కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లాలో మొత్తం 1,70,331 చీరలు పంపిణీ చేస్తామన్నారు. ఇందులో 1,14,681 చీరలు జిల్లాకు చేరుకున్నాయని, మిగతా 55,650 చీరలు త్వరలోనే వస్తాయని వెల్లడించారు.
News November 19, 2025
కగార్ ఎన్కౌంటర్లపై న్యాయ విచారణ జరిపించాలి: సీపీఐ

కగార్ ఆపరేషన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం జరుపుతున్న మావోయిస్టుల ఎన్కౌంటర్లన్నింటిపైనా న్యాయ విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. బుధవారం హనుమకొండ బాలసముద్రంలోని జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేని శంకర్తో కలిసి ఆయన ఈ మేరకు తెలిపారు.


