News March 30, 2025
పెద్దపల్లి: గురుకులంలో ప్రవేశాలు.. రేపే లాస్ట్ డేట్

తెలంగాణ మహాత్మా జ్యోతిబాఫూలే గురుకులాల్లో 2025-26 విద్యాసంవత్సరానికి 6 నుంచి 9వ తరగతులలో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, అనాథలు అర్హులని తెలిపారు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 20న నిర్వహించనున్నారు. హాల్టికెట్లు ఏప్రిల్ 15 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని, దరఖాస్తు గడువు మార్చి 31న ముగియనుందని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
Similar News
News October 27, 2025
రామగుండం: ఆకట్టుకున్న డాగ్ స్క్వాడ్ ప్రదర్శన

రామగుండం కమిషనరేట్లో సోమవారం జరిగిన ఓపెన్ హౌస్ కార్యక్రమంలో డాగ్ స్క్వాడ్ ప్రదర్శన విద్యార్థులను ఆకట్టుకుంది. స్నిఫర్ డాగ్స్ ప్రతిభను విద్యార్థులు ఆసక్తిగా వీక్షించారు. ఫింగర్ ప్రింట్ డివైస్లు, కమ్యునికేషన్ సిస్టమ్లు, బాంబ్ డిస్పోజల్ ఎక్విప్మెంట్, ట్రాఫిక్ సేఫ్టీ పరికరాలు, గంజాయి, డ్రగ్స్ నిరోధక కిట్లతో ఏర్పాటు చేసిన స్టాల్స్ ద్వారా పోలీస్ సిబ్బంది విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు.
News October 27, 2025
సైబర్ నేరాల వలలో చిక్కితే 1930కి CALL

RGM ఓపెన్ హౌస్లో పాల్గొన్న కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ.. విద్యార్థులు సైబర్ నేరాల వలలో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సైబర్ మోసాలు జరిగితే వెంటనే 1930 టోల్ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలన్నారు. పోలీసులు కేవలం నేరస్థులను పట్టుకోవడమే కాకుండా సమాజ భద్రత, చట్ట అవగాహన పెంపు కోసం నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. మహిళల రక్షణకు షీ టీమ్స్, భరోసా సెంటర్లు చేస్తున్న సేవలను వివరించారు.
News October 27, 2025
దివ్యాంగుల చట్టం వాల్ పోస్టర్ ఆవిష్కరించిన భద్రాద్రి ఎస్పీ

కొత్తగూడెం పట్టణంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో దివ్యాంగుల చట్టం 2016 సంబంధించిన వాల్ పోస్టర్లను సోమవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ.. దివ్యాంగుల చట్టం 2016 ప్రకారం దివ్యాంగులను కించపరిచినా, అవహేళనగా మాట్లాడినా, ఎగతాళి చేసిన చట్టం ప్రకారం శిక్షకు గురి అవుతారని అన్నారు.


