News March 17, 2025

పెద్దపల్లి: గురుకుల ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తులు 

image

గురుకులాల్లో ప్రవేశాలకు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని BC గురుకులాల జిల్లా కో-ఆర్డినేటర్ మణి దీప్తి సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మార్చి 31లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. మహాత్మ జ్యోతిబా ఫులే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలోని BC బాలికల, బాలుర పాఠశాలల్లో 2025-26 వార్షిక విద్య 6-9తరగతులకు www.mgtbcadmissions.orgలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Similar News

News March 18, 2025

ఎర్రగుంట్లలో తెల్లవారుజామున ఘోర ప్రమాదం

image

ఎర్రగుంట్ల పట్టణ పరిధిలోని కడప రోడ్డులోని మై హోమ్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళుతున్న వాహనాన్ని వెనుక నుంచి వెళుతున్న పెట్రోల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సత్యసాయి జిల్లాకు చెందిన గండులూరి ఖాదరయ్య(41) అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 18, 2025

లండన్ వెళ్లిన చిరంజీవి.. రేపు అవార్డు స్వీకరణ

image

కళారంగంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన కృషికి యూకే ప్రభుత్వం రేపు ఆయనను సన్మానించనుంది. ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు’ను మెగాస్టార్‌కు యూకే పార్లమెంట్ ప్రదానం చేయనుంది. ఈ క్రమంలో ఆయన లండన్ చేరుకోగా అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది. గత ఏడాది ఆయన్ను పద్మవిభూషణ్ అవార్డు, ఏఎన్ఆర్ జీవిత సాఫల్య పురస్కారం వరించిన సంగతి తెలిసిందే.

News March 18, 2025

VKB: బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా రాజశేఖర్ రెడ్డి

image

వికారాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ రాజశేఖర్ రెడ్డి నియామకమయ్యారు. జిల్లా అధ్యక్ష పదవి కోసం బీజేపీ సీనియర్ నాయకులు శివరాజ్, సదానందరెడ్డి, రమేశ్, కేపీ రాజు, వడ్ల నందు, రాజశేఖర్ రెడ్డి పోటీ పడ్డారు. కాగా అధ్యక్ష పదవి రాజశేఖర్ రెడ్డికి వరించింది. తన నియామకానికి సహకరించిన వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 

error: Content is protected !!