News January 27, 2025
పెద్దపల్లి: గుర్తుతెలియని వ్యక్తి మృతి

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఏరియాలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. రాత్రి సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సదరు వ్యక్తి పసుపు రంగు షర్టు ధరించాడని, వయస్సు 60 సంవత్సరాల వరకు ఉంటుందని చెప్పారు. జిల్లాలో ఎవరైనా అదృశ్యమైతే సంప్రదించాలని పోలీసులు సూచించారు.
Similar News
News October 14, 2025
కొత్త PF నిర్ణయాలు.. ఒక్కసారి ఆలోచించండి

EPFO ఎంప్లాయి షేర్ 100%తో పాటు ఎంప్లాయర్ షేర్ 100% విత్డ్రాకు అనుమతిస్తూ నిర్ణయించింది. ఇది ఊరటగా భావించి డబ్బు తీసుకుందాం అనుకుంటే.. ఆలోచించండి. ఇతర మార్గాలతో పోలిస్తే ఇక్కడ తీసుకుంటే లాభం అనుకుంటేనే డ్రా చేయండి. ఎందుకంటే ప్రభుత్వ సేవింగ్ స్కీమ్స్లో PFకు ఖాతాకే అధిక వడ్డీరేటు (8.25%) ఉంది. ఇప్పుడు తాత్కాలిక అవసరాలకు సర్దుకుంటే PFలో డబ్బుకు వడ్డీ, వడ్డీపై వడ్డీల లాభం భవిష్యత్తులో అండగా ఉంటుంది.
News October 14, 2025
మెదక్: NMMS దరఖాస్తుకు నేడే లాస్ట్ డేట్

నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ (NMMS) పరీక్ష దరఖాస్తుల గడువు ఈ మంగళవారంతో ముగియనుందని ఉమ్మడి మెదక్ జిల్లా విద్యాధికారులు తెలిపారు. ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులని పేర్కొన్నారు. స్కీమ్ కింద ఎంపికైన విద్యార్థులకు ప్రభుత్వం నెలకు రూ.1,000 చొప్పున ఆర్థిక సహాయం అందించనుందని తెలిపారు. పూర్తి వివరాలకు bse.telangana.gov.in వెబ్సైట్ను సందర్శించాలన్నారు.
News October 14, 2025
NLG: వాతవరణం.. వరి పంటకు ప్రతికూలం

ఈ ఏడాది వర్షాలు రైతుల వెన్ను విరుస్తున్నాయి. జిల్లాలో సాగు చేసిన వరి పంట ప్రస్తుతం కంకి వెళ్లే దశలో ఉంది. కొన్ని ప్రాంతాల్లో పొట్టదశలో, మరికొన్ని చోట్ల కంకి వెళ్లి గింజపోసుకునే దశలో ఉన్నాయి. అయితే గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు ప్రతికూలంగా మారాయి. వరిపొట్టలోకి నీరు చేరడంతో చీడపీడలు ఎక్కువవుతున్నాయి. కంకి వెళ్లిన పంటలో సుంకు రాలిపోతోంది. కంకి వెళ్లి గింజపోసుకుంటున్న వరి వానలకు నేలవాలుతోంది.