News February 25, 2026
పెద్దపల్లి: గ్రామపంచాయతీ వార్డు సభ్యుల శిక్షణ కార్యక్రమం

బ్రాహ్మణపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ వార్డు సభ్యులకు నిర్వహిస్తున్న 5 రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా మూడవరోజు కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీడీవో కొప్పుల శ్రీనివాసు ముఖ్యఅతిథిగా హాజరై గ్రామ అభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్రపై అవగాహన కల్పించారు. గ్రామ సర్పంచి మేకల రోజారాణి మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలు ప్రజలకు సమర్థవంతంగా చేరవేయడంలో శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.
Similar News
News April 14, 2026
కామారెడ్డిలో కూరగాయల ధరలు ఇలా!

కామారెడ్డి మార్కెట్లో కూరగాయల ధరలు మంగళవారం సాధారణంగా కొనసాగుతున్నాయి. మార్కెట్‌లో కేజీ టమాటా రూ.20, బీరకాయ రూ.60, క్యాబేజీ రూ.50, కాకరకాయ రూ.60, ఆలుగడ్డ రూ.30, ఉల్లిపాయ రూ.20గా విక్రయిస్తున్నారు. అలాగే పాలకూర రూ.50, వంకాయ రూ.50, క్యారెట్ రూ.50, చిక్కుడు రూ.50, కాలీఫ్లవర్ రూ.50, క్యాప్సికమ్ రూ.50 ధరలకు లభిస్తున్నాయి. ధరలు స్థిరంగా ఉండటంతో వినియోగదారులు కొంత ఊరట వ్యక్తం చేస్తున్నారు.
News April 14, 2026
బాపట్ల: ఫైఓవరపై దొరికిన వ్యక్తి మృతి..ఆచూకీ తెలిస్తే తెలపండి

బాపట్లలోని ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి సోమవారం మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం గుంటూరు రహదారి ఫ్లైఓవర్‌పై అపస్మారక స్థితిలో పడి ఉన్న అతడిని స్థానికులు 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు. చికిత్స ఫలితం లేక మరణించాడని, మృతుడి ఆచూకీ తెలిసిన వారు వెంటనే పట్టణ పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News April 14, 2026
గొప్ప ఆర్థికవేత్త అంబేడ్కర్!

భారత రాజ్యాంగ నిర్మాతగా అందరికీ తెలిసిన Dr.BR అంబేడ్కర్ గొప్ప ఆర్థికవేత్త కూడా. 1923లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో డాక్టరేట్ కోసం ఆయన రాసిన ‘ది ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ’ పుస్తకం IND, బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థల బలోపేతానికి దోహదపడింది. దేశంలో RBI ఏర్పాటుకూ సహకరించింది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఆర్థిక దోపిడీ, భారతీయులను ఆర్థిక బానిసలుగా మార్చిన తీరును తన పరిశోధనలతో ప్రపంచానికి చాటారు. ఇవాళ ఆ మహనీయుడి జయంతి.


