News March 31, 2025
పెద్దపల్లి: గ్రామాల్లో జోరుగా పైరవీలు..?

PDPL జిల్లావ్యాప్తంగా జరిగిన ప్రజాపాలనలో ప్రజలు ఇందిరమ్మ ఇండ్లకోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ, ప్రభుత్వం ఇప్పటివరకు లబ్ధిదారుల లిస్ట్ను ఫైనల్ చేయలేదు. జిల్లాకు 10,500 ఇళ్లు మంజూరైన విషయం తెలిసిందే. దీంతో జిల్లాలోని అధికారపార్టీకి చెందిన చోటామోటా నాయకులు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తామని జోరుగా పైరవీలు సాగిస్తున్నట్లు సమాచారం. అసలైన అర్హులు తమకు ఇందిరమ్మ ఇల్లు వస్తుందో, రాదో అని ఆందోళన చెందుతున్నారు.
Similar News
News December 9, 2025
విశాఖలో కాగ్నిజెంట్ కార్యాలయాన్ని ప్రారంభించనున్న CM

CM చంద్రబాబు ఈనెల 12న విశాఖలో పర్యటించనున్నారు. ముందుగా మధురవాడ ఐటీ సెజ్ హిల్-2లో ప్రముఖ IT కంపెనీ కాగ్నిజెంట్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభిస్తారు. అదేవిధంగా కాపులుప్పాడలో ఆ సంస్థకు ప్రభుత్వం కేటాయించిన భూముల్లో శాశ్వత భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం వీఈఆర్ సమావేశానికి హాజరై, వివిధ అభివృద్ధి అంశాలపై సమీక్ష చేస్తారు. పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.
News December 9, 2025
13న నరసాపురంలో జాతీయలోక్ అదాలత్: జడ్జి

ఈ నెల 13న నర్సాపురంలోని అన్ని కోర్టు సముదాయాలలో నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని నర్సాపురం పదో అదనపు జిల్లా న్యాయమూర్తి వాసంతి తెలిపారు. న్యాయవాదులు, పోలీసు అధికారులు సహకరించాలని న్యాయమూర్తి సూచించారు. రాజీపడదగిన అన్ని క్రిమినల్, ఎక్సైజ్, మోటార్ వాహన ప్రమాద భీమాకు సంబంధించిన కేసులు, సివిల్ తగాదాలు, కుటుంబ తగాదాలు రాజీ చేసుకోవచ్చని చెప్పారు.
News December 9, 2025
KMR: తొలి దశ పోలింగ్కు రంగం సిద్ధం: కలెక్టర్

కామారెడ్డి జిల్లాలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా, మొదటి దశలో ఎన్నికలు జరిగే మండలాలకు సంబంధించిన పోలింగ్ సిబ్బంది తుది ర్యాండమైజేషన్ ప్రక్రియ మంగళవారం పూర్తయింది. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సమక్షంలో ఈ ర్యాండమైజేషన్ జరిగింది. మొదటి దశలో జీపీలు 157, 1444 వార్డులకు ఎన్నికలు నిర్వహించడానికి 1457 టీములకు సంబంధించిన మండలాల వారీగా ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు.


