News January 31, 2025

పెద్దపల్లి: చివరి ఆయకట్టుకు ఎస్సారెస్పీ నీళ్లు: ఎమ్మెల్యే

image

డి 83 ఎస్‌ఆర్ ఎస్‌పి కాల్వ 22 ఆర్ నుంచి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేందుకు చర్యలు చేపడుతున్నామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. ఈ సందర్భంగా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెద్దరాత్ పల్లి గ్రామంలో స్థానిక నాయకులతో కలిసి ఎస్ఆర్ఎస్పి కాలువను ఆయన పరిశీలించారు. మండలంలోని చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేందుకు రూ.50 లక్షలు ఖర్చుపెట్టి పూడిక తీయించామని తెలిపారు.

Similar News

News December 2, 2025

నడకతో అల్జీమర్స్‌ను నివారించొచ్చు: వైద్యులు

image

అల్జీమర్స్‌ను నడకతో నివారించవచ్చని కొత్త అధ్యయనంలో తేలిందని డాక్టర్ సుధీర్ కుమార్ తెలిపారు. నేచర్ మెడిసిన్‌ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం రోజుకు 3,000–5,000 అడుగులు నడిస్తే మెదడులో అల్జీమర్స్ కారక ప్రోటీన్ల నిర్మాణం నెమ్మదిస్తుందని తేలింది. అల్జీమర్స్‌కు చికిత్స లేనప్పటికీ, నివారణ సాధ్యమని చెబుతున్నారు. నడక అనేది అత్యంత శక్తిమంతమైన నివారణ మార్గమని, నడక మొదలుపెట్టాలని సూచించారు.

News December 2, 2025

మెదక్: భార్యను చంపి భర్త సూసైడ్ !

image

మెదక్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. టేక్మాల్ మండలం బర్దిపూర్‌లో భార్యను చంపి, భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాలిలా.. గ్రామానికి చెందిన గంగారం శ్రీశైలం(37), మంజుల (34) దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. మంగళవారం ఉదయానికి మంజుల హత్యకు గురికాగా, శ్రీశైలం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. అనుమానస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు.

News December 2, 2025

సీఎం పర్యటన షెడ్యూల్ విడుదల..

image

డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు బేగంపేట్ ఎయిర్ పోర్టుకు సీఎం చేరుకుని 12:50కి హెలికాప్టర్ ద్వారా కొత్తగూడెం బయలుదేరుతారు. 2 గంటలకు భద్రాద్రి కలెక్టరేట్‌కు చేరుకుంటారు. 2:15 నుంచి 2:40 గంటల మధ్య యూనివర్సిటీని ప్రారంభిస్తారు. 2:45 నుంచి 3:45 గంటల వరకు యూనివర్సిటీ ప్రాంగణంలోని గ్రౌండ్లో జరిగే సభలో CM ప్రసంగిస్తారు.