News February 24, 2025
పెద్దపల్లి: జర్నలిస్టుల సమస్యలపై జిల్లా కలెక్టర్కు వినతి

పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యలపై జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల విషయంలో సర్కారు ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. ఆరోగ్య బీమా, రైల్వే పాస్, కొత్త అక్రిడిటేషన్ కార్డులు అందించాలని కోరారు. నిత్యం వివిధ రాజకీయ నాయకులు జర్నలిస్టులపై దాడులు చేస్తున్నారని, వారి కోసం ప్రత్యేక చట్టాలు తేవాలని కోరారు.
Similar News
News November 18, 2025
అధికారులు నిద్రావస్థలో ఉంటే అభివృద్ధి ఎలా సాధ్యం: MP

జిల్లా అధికారులు నిద్రావస్థలో ఉంటే అభివృద్ధి ఎలా జరుగుతుందని ఎంపీ కడియం కావ్య అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్లో దిశ ప్రోగ్రాం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను సద్వినియోగం చేసుకోకపోవడం అందుకు తగిన విధంగా అధికారులు పనిచేయకపోవడం, శోచనీయమన్నారు. జిల్లాకు మంజూరైన 6 పల్లె దవాఖానాలు ముందుకు వెళ్లలేదని, దీంతో నిధులు వెనక్కి వెళ్తున్నట్లు పేర్కొన్నారు.

అల్లూరి: ‘చైతన్యాన్ని రగిలించిన మహోన్నత వ్యక్తి’

రచనల ద్వారా సమాజంలో చైతన్యాన్ని రగిలించిన మహోన్నత వ్యక్తి కనకదాసు అని కలెక్టర్ దినేశ్ కుమార్ అన్నారు. భక్త కనకదాసు ఒక గొప్ప కవిగా, తత్వవేత్తగా, అపారమైన సామాజిక సంస్కర్తగా అందించిన సేవలను దేశం స్మరించుకుంటోందన్నారు. మంగళవారం భక్త కనకదాసు జయంతిని కలెక్టరేట్లో నిర్వహించారు. అతని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కనకదాసు జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.