News February 26, 2026
పెద్దపల్లి: ‘జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి దరఖాస్తు చేయాలి’

జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (NFBS)కు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. బీపీఎల్ కుటుంబంలో 18-60 ఏళ్ల మధ్య వయస్సు గల కుటుంబ పోషకుడు మరణిస్తే రూ.20 వేల ఆర్థిక సహాయం అందిస్తారని తెలిపారు. పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీవో, తహశీల్దార్ కార్యాలయాలు లేదా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇతర ప్రభుత్వ సహాయం పొందకపోతేనే పథకం వర్తిస్తుందని పేర్కొన్నారు.
Similar News
News April 19, 2026
గ్రేటర్ జోన్‌లో రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్

గ్రేటర్ జోన్‌లో విద్యుత్ డిమాండ్ కొత్త రికార్డును సృష్టించింది. గత రెండు రోజులుగా అత్యధికంగా 99 నుంచి 100 మిలియన్ యూనిట్లు నమోదవుతోంది. సాధారణంగా వేసవి తీవ్రత పెరిగే మే నెలలో విద్యుత్ వినియోగం గరిష్ట స్థాయికి చేరుతుంది. ఈ సారి ఉష్ణోగ్రతలు ముందుగానే పెరగడం, వాణిజ్య, గృహ వినియోగం అధికం కావడం వల్ల మార్చి ప్రారంభంలోనే రికార్డు స్థాయి డిమాండ్ నమోదైంది.

హైదరాబాద్: ప్రతి ఒక్కరూ 20% నీటిని ఆదా చేయాలి

వేసవి దృష్ట్యా వచ్చే 45 రోజులు అత్యంత కీలకమని, ప్రతి ఒక్కరూ 20 శాతం నీటిని ఆదా చేయాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి కోరారు. నగరంలో నీటి సరఫరాపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. గత నాలుగేళ్లతో పోలిస్తే ట్యాంకర్ల డిమాండ్ భారీగా పెరిగిందని, సరఫరా 52 వేల నుంచి లక్షా 8 వేలకు చేరిందన్నారు. కేవలం 20 శాతం ప్రాంతాల్లోనే అధిక డిమాండ్ ఉందని, నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.