News March 4, 2025

పెద్దపల్లి జిల్లాలోని ఉష్ణోగ్రతలు ఇలా..!

image

పెద్దపల్లి జిల్లాలో ఉష్ణోగ్రత ఇలా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా సుల్తానాబాద్ 39.3℃ నమోదు కాగా పాలకుర్తి 39.2, ముత్తారం 39.2, జూలపల్లి 39.2, మంథని 39.2, రామగుండం 39.1, అంతర్గం 39.1, కాల్వ శ్రీరాంపూర్ 39.1, పెద్దపల్లి 39.0, రామగిరి 39.0, ఓదెల 38.7, కమాన్పూర్ 38.6, ధర్మారం 38.3, ఎలిగేడు 37.7℃ గా నమోదయ్యాయి. మరో 3 రోజులు జిల్లాలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Similar News

News December 5, 2025

ప్రెగ్నెన్సీలో ఇది ప్రాణాంతకం

image

బిడ్డకు జన్మనివ్వడం ప్రతి మహిళకూ పునర్జన్మలాంటిది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని కాంప్లికేషన్లు వచ్చి ప్రాణాలు కోల్పోతారు. వాటిల్లో ఒకటే ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఎంబాలిజం. దీనివల్ల గర్భంలోని ఉమ్మనీరు తల్లి రక్తంలో కలిసిపోతాయి. దీంతో శరీరం ప్రతిస్పందిస్తుంది. దీంతో ఊపిరి ఆడకపోవడం, బీపీ పెరగడం, గుండెకు రక్తసరఫరా ఆగిపోవడం, అధిక రక్తస్రావం జరిగి కొద్ది సమయంలోనే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది.

News December 5, 2025

సికింద్రాబాద్‌: ‘పుష్ప’ స్టైల్లో హవాలా డబ్బు రవాణా

image

సికింద్రాబాద్‌లో ‘పుష్ప’ సినిమా స్టైల్లో హవాలా డబ్బు రవాణా చేస్తున్నారు. దీంతో 15 కిలోమీటర్లు బోయిన్‌పల్లి పోలీసులు సాహసోపేతంగా ఛేజ్ చేసి ముఠాను అడ్డగించారు. కార్ డిక్కీ, టైర్లు, బానెట్, సీట్లలో దాచిన భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఛేజ్ చేసి పట్టుకున్న ఈ హవాలా గ్యాంగ్‌ రూ.కోట్లు తరలిస్తుండగా పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News December 5, 2025

తిరుమల దర్శనం టికెట్లు.. భక్తులకు గమనిక

image

తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలు జరిగే 10రోజులు SSD(తిరుపతిలో ఇస్తున్న టైం స్లాట్) టోకెన్లు జారీ చేయరు. తొలి 3రోజులు ఆన్‌లైన్ టోకెన్లు ఉన్నవారినే అనుమతిస్తారు. తర్వాత నుంచి వచ్చే వారంతా నేరుగా కొండకు వచ్చి వైకుంఠం క్యూకాంప్లెక్స్-2 నుంచి దర్శనానికి వెళ్లవచ్చు. జనవరి 2నుంచి 8వ తేదీ వరకు శ్రీవాణి టికెట్లను ఇవాళ ఉదయం 10గంటలకు రిలీజ్ చేయగా.. SED(రూ.300) టిక్కెట్లు ఇవాళ మధ్యాహ్నం 3గంటలకు విడుదల కానున్నాయి.