News April 6, 2025
పెద్దపల్లి జిల్లాలోని ఉష్ణోగ్రతలు ఇలా

పెద్దపల్లి జిల్లాలోని ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా అంతర్గం 39.8℃ నమోదు కాగా రామగుండం 38.8, మంథని 39.7, సుల్తానాబాద్ 39.6, పెద్దపల్లి 39.5, కాల్వ శ్రీరాంపూర్ 39.4, పాలకుర్తి 39.4, రామగిరి 39.3, ఓదెల 39.3, కమాన్పూర్ 39.2, జూలపల్లి 39.1, ముత్తారం 38.9, ఎలిగేడు 38.5, ధర్మారం 38.4℃ గా నమోదయ్యాయి. ఇక 10 దాటితే జిల్లాలో ఎండ తీవ్రత విపరీతంగా పెరుగుతుంది.
Similar News
News December 1, 2025
చిన్నబజార్ PSను తనిఖీ చేసిన గుంటూరు IG

నెల్లూరులోని చిన్నబజార్ PSను గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిధిలోని పరిస్థితులు, స్థితిగతులు, నేర ప్రాంతాలపై సిబ్బందిని అడిగి పలు విషయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫిర్యాదుదారులపట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. పెండింగ్ కేసుల పరిష్కారంలో జాప్యం లేకుండా చూడాలన్నారు. వీరి వెంట ఎస్పీ అజిత వేజెండ్ల ఉన్నారు.
News December 1, 2025
నందికొట్కూరు ఎమ్మెల్యేను కలిసిన డిప్యూటీ ఎంపీడీవోలు

నందికొట్కూరు నియోజకవర్గంలో కొత్తగా నియమితులైన డిప్యూటీ ఎంపీడీవోలు నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్యను సోమవారం కలిశారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో నందికొట్కూరు డిప్యూటీ ఎంపీడీవో పాండురంగారెడ్డి, మిడుతూరు ఎంపీడీవో సురేశ్ కుమార్, పగిడ్యాల ఎంపీడీవో మన్సూర్ బాషా, జూపాడుబంగ్లా ఎంపీడీవో మోహన్ నాయక్, పాములపాడు ఎంపీడీవో తిరుపాలయ్య, కొత్తపల్లి ఎంపీడీవో పీఎస్ఆర్ శర్మ ఉన్నారు.
News December 1, 2025
టీటీడీలో అన్యమతస్తులపై నివేదిక తయారీ

టీటీడీలో అన్యమతస్తుల అంశం మరోసారి తెర పైకి వచ్చింది. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీలో ఇంకా ఎవరైనా ఆన్యమతస్తులు ఉంటే వారిని గుర్తించి తదుపరి చర్యల నిమిత్తం నివేదిక తయారు చేయాలని ఆదేశించారు.


