News April 6, 2025

పెద్దపల్లి జిల్లాలోని ఉష్ణోగ్రతలు ఇలా

image

పెద్దపల్లి జిల్లాలోని ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా అంతర్గం 39.8℃ నమోదు కాగా రామగుండం 38.8, మంథని 39.7, సుల్తానాబాద్ 39.6, పెద్దపల్లి 39.5, కాల్వ శ్రీరాంపూర్ 39.4, పాలకుర్తి 39.4, రామగిరి 39.3, ఓదెల 39.3, కమాన్పూర్ 39.2, జూలపల్లి 39.1, ముత్తారం 38.9, ఎలిగేడు 38.5, ధర్మారం 38.4℃ గా నమోదయ్యాయి. ఇక 10 దాటితే జిల్లాలో ఎండ తీవ్రత విపరీతంగా పెరుగుతుంది.

Similar News

News April 18, 2025

MEMU రైలు అనంతపురం వరకు..

image

అనంతపురం జిల్లా ప్రజలకు రైల్యే శాఖ తీపి కబురు చెప్పింది. పుట్టపర్తి ప్రశాంతి నిలయం నుంచి బెంగళూరుకు నడుస్తున్న MEMU రైలును అనంతపురం వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే ఈ రైలు అనంతపురం-బెంగళూరు మధ్య పరుగులు పెట్టనుంది. KSR బెంగళూరులో ఉ.8.35 గంటలకు బయలు దేరి అనంతపురానికి మ.1.55 గంటలకు చేరుకుంటుంది. తిరిగి అనంతలో మ.2.10 గంటలకు బయలుదేరి రాత్రి 7.50 గంటలకు బెంగళూరుకు చేరుకుంటుంది.

News April 18, 2025

మామునూరు ఎయిర్‌పోర్టు.. నెక్స్ట్ ఏంటి?

image

మామునూరు ఎయిర్‌పోర్టుకు కేంద్రం పచ్చ జెండా ఊపిన విషయం తెలిసిందే. ఇందుకు 949ఎకరాలు అవసరమవగా 696ఎకరాలు సేకరించారు. మరో 253ఎకరాల కోసం 3గ్రామాలను ఒప్పించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అక్కడి భూముల ధరలు అమాంతం పెరగడంతో ఎకరాకు రూ.5కోట్లు ఇవ్వాలనే డిమాండ్ వచ్చింది. దీంతో ఎయిర్‌పోర్టు అంశం పట్టాలు తప్పినట్లేనా అని జిల్లా వాసులు అభిప్రాయపడుతున్నారు. సమస్యను క్లియర్ చేసి త్వరగా నిర్మించాలని కోరుతున్నారు.

News April 18, 2025

IPL: అనూహ్య ‘నో బాల్’.. ఎలాగంటే?

image

నిన్న MI, SRH మ్యాచ్‌లో ఓ అనూహ్య నో బాల్ వెలుగులోకి వచ్చింది. అన్సారీ బౌలింగ్‌లో రికెల్టన్ షాట్ ఆడగా కమిన్స్ క్యాచ్ పట్టారు. అయితే, బ్యాటర్ ఔట్ కాలేదు. దీనికి కారణం నో బాల్. రూల్ ప్రకారం బ్యాట్‌ను బంతి తాకక ముందే కీపర్ గ్లౌవ్స్ స్టంప్స్ కంటే ముందుకొస్తే నో బాల్ ఇస్తారు. నిన్న క్లాసెన్ గ్లౌవ్స్ ఇలాగే ముందుకొచ్చాయి. అయితే, కీపర్ తప్పునకు బౌలర్‌కు శిక్ష ఏంటని పలువురు క్రికెటర్లు ప్రశ్నిస్తున్నారు.

error: Content is protected !!