News March 2, 2025

పెద్దపల్లి జిల్లాలోని గరిష్ట ఉష్ణోగ్రతలు ఇలా

image

పెద్దపల్లి జిల్లాలో ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా రామగిరి 37.5℃ నమోదు కాగా ముత్తారం 37.1, అంతర్గం 37.0, కాల్వ శ్రీరాంపూర్ 36.8, మంథని 36.6, రామగుండం 36.5, PDPL 36.3, కమాన్పూర్ 35.9, ఓదెల 35.8, సుల్తానాబాద్ 35.8, ధర్మారం 35.2, జూలపల్లి 34.8, ఎలిగేడు 33.9℃ గా నమోదయ్యాయి. మరో 3 రోజుల తర్వాత PDPL జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Similar News

News December 7, 2025

కొత్తగూడెం: మత్తులో ట్రాక్‌ దాటుతూ రైలు కిందపడి..

image

మద్యం మత్తులో రైల్వే ట్రాక్ దాటుతుండగా గూడ్స్ రైలు కిందపడి ఓ యువకుడు ప్రమాదానికి గురైన ఘటన కొత్తగూడెంలో జరిగింది. శనివారం రాత్రి రైటర్ బస్తీ గొల్లగూడెం పక్కన ఉన్న ట్రాక్ దాటుతున్న యూసఫ్ అనే యువకుడికి ప్రమాదంలో కుడి కాలు విరిగింది. రైల్వే పోలీసులు 108 అంబులెన్స్‌లో అతడిని చికిత్స కోసం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News December 7, 2025

విజయవాడ: ‘నకిలీ మద్యం కేసులో జోగి రమేశ్ కీలకం’

image

నకిలీ మద్యం కేసులో కీలక నిందితుడిగా మాజీ మంత్రి జోగి రమేశ్‌ను గుర్తించినట్లు సిట్ అధికారులు తెలిపారు. ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావుకు రూ. 3 కోట్లు ఇస్తానని ప్రలోభ పెట్టినట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వంపై బురద జల్లే దురుద్దేశంతోనే ఈ కుట్రకు పాల్పడినట్లు సిట్ తెలిపింది. జనార్దన్ రావు ఆఫ్రికా వెళ్లడానికి కూడా జోగి రమేశే కారణమని వెల్లడించింది.

News December 7, 2025

అఫీషియల్.. మాజీ ప్రధాని ప్రేమాయణం

image

అమెరికన్ పాప్ సింగర్ కేటీ పెర్రీ, కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడోతో తన ప్రేమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. జపాన్ పర్యటనలో దిగిన సెల్ఫీని Instaలో షేర్ చేశారు. ఫ్రాన్స్‌లో అక్టోబర్ 25న పెర్రీ పుట్టినరోజు వేడుకల్లో వీరిద్దరూ తొలిసారి పబ్లిక్‌లో కనిపించారు. కాగా 53 ఏళ్ల ట్రూడోకి ముగ్గురు పిల్లలు ఉన్నారు. 2023లో భార్య నుంచి విడిపోయారు. పెర్రీకి 2010లో పెళ్లి కాగా 2012 నుంచి విడిగా ఉంటున్నారు.