News March 16, 2025

పెద్దపల్లి జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా

image

పెద్దపల్లి జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. స్కిన్ లెస్ కేజీ రూ.200-240 ఉండగా విత్ స్కిన్ కేజీ రూ.170-180 ధర పలుకుతుంది. అలాగే లైవ్ కోడి రూ.150-160 మధ్య ఉంది. ఇక బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్‌తో గతనెల క్రితం భారీగా అమ్మకాలు పడిపోగా ప్రస్తుతం అమ్మకాలు పెరిగాయని ధర సైతం పెరిగిందని నిర్వాహకులు చెబుతున్నారు. 

Similar News

News November 27, 2025

సిరిసిల్ల: ‘అనుగుణంగా విధులు నిర్వహించాలి’

image

ఎన్నికల ప్రవర్తన నియమావళికి అనుగుణంగా విధులు నిర్వహించాలని సిరిసిల్ల ఇన్చార్జి కలెక్టర్ గరీమ అగ్రవాల్ అన్నారు. సిరిసిల్లలోని కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. నోడల్ అధికారులు విధులు బాధ్యతలపై అవగాహన కలిగి ఉండాలని స్పష్టం చేశారు. మానవ వనరుల నిర్వహణ, శిక్షణ, రవాణా, మోడల్ కోడ్ కండక్ట్, ఖర్చు, పర్యవేక్షణ, పోస్టల్ బ్యాలెట్ సక్రమంగా ఉండాలన్నారు.

News November 27, 2025

గ్రామ పంచాయతీ ఎన్నికలపై ఫిర్యాదులకు ఆన్లైన్ పోర్టల్

image

గ్రామపంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో వివిధ అంశాలపై ఫిర్యాదు చేసేందుకు ఆన్లైన్ పోర్టల్ అందుబాటులోకి వచ్చిందని ఇంచార్జి కలెక్టర్, ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ తెలిపారు. ఓటర్ల జాబితా, నామినేషన్లు, ఓట్ల లెక్కింపు ఇతర అంశాలపై కింద ఇచ్చిన ఆన్లైన్ పోర్టల్ https://grievance.tsec.gov.in/home ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు.

News November 27, 2025

రౌడీషీటర్స్ సంస్కరణ దిశగా రాచకొండ కమిషనరేట్

image

రాచకొండ పోలీసులు వినూత్న ప్రయత్నం చేశారు. రౌడీషీటర్లను సంస్కరించే దిశగా ఉప్పల్, ఎల్బీనగర్, ఈసీఐఎల్ ప్రాంతాల్లో ట్రాఫిక్ నిర్వహణలో భాగస్వాముల్ని చేశారు. తప్పులు దిద్దుకుని ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని వారు స్వాగతిస్తున్నారు. సమాజ మార్పు వైపు రాచకొండ కమిషనరేట్ పోలీసుల ముందడుగు వేశారు.