News April 13, 2025
పెద్దపల్లి జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా

పెద్దపల్లి జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. స్కిన్ లెస్ కేజీ రూ.200-240 ఉండగా.. విత్ స్కిన్ కేజీ రూ.180-200 ధర పలుకుతుంది. అలాగే లైవ్ కోడి రూ.130-140 మధ్య ఉంది. ఇక బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్‌తో గతనెల క్రితం భారీగా అమ్మకాలు పడిపోగా.. ప్రస్తుతం అమ్మకాలు పెరిగాయని, ధర సైతం పెరిగిందని నిర్వాహకులు చెబుతున్నారు. ఎండ తీవ్రతతో కోళ్ల మరణాలు ఎక్కువ కావడంతో రేటు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు.
Similar News
News January 23, 2026
అమలాపురంలో ఉభయగోదావరి జిల్లాల బెంచ్ ప్రెస్ పోటీలు

అమలాపురంలోని ‘హెల్త్ అండ్ ఫిట్నెస్ జిమ్’ వేదికగా ఈనెల 25న ప్రథమ ఉభయగోదావరి జిల్లాల స్థాయి బెంచ్ ప్రెస్ పోటీలు నిర్వహించనున్నట్లు కోచ్ కంకిపాటి వెంకటేశ్వరరావు వెల్లడించారు. సబ్ జూనియర్, సీనియర్, మాస్టర్స్, మహిళా విభాగాల్లో ఈపోటీలు జరుగుతాయని ఆయన తెలిపారు. ప్రతి విభాగంలోనూ ప్రతిభ కనబరిచి మొదటి మూడు స్థానాల్లో నిలిచిన క్రీడాకారులకు మెరిట్ సర్టిఫికెట్లు, పతకాలు, ట్రోఫీలను అందజేయనున్నట్లు పేర్కొన్నారు.
News January 23, 2026
VZM: వివాహిత అనుమానాస్పద మృతి

విజయనగరంలోని అయ్యన్నపేటలో జయ కృష్ణవేణి(30) అనే వివాహిత మంటల్లో చిక్కుకుని సజీవ దహనమైంది. 1టౌన్ SI లీలావతి తెలిపిన వివరాల ప్రకారం.. పార్వతీపురం ప్రాంతానికి చెందిన చేతన్ ఆదిత్యతో ఆమెకు ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. గురువారం మధ్యాహ్నం ఇంట్లో నుంచి పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు వచ్చేలోపే ఆమె మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
News January 23, 2026
కామారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయంటే

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలను అధికారులు వెల్లడించారు. ఎల్పుగొండ 13.9°C, లచ్చపేట 14.1, ఇసాయిపేట 14.4, రామలక్ష్మణపల్లి, జుక్కల్ 14.7, మేనూరు 14.9, దోమకొండ, గాంధారి 15°Cల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా ప్రదేశాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదు కాగా పాతరాజంపేటలో 0.5మి.మీ వర్షపాతం నమోదైంది. చలి ప్రభావం అంతంత మాత్రమే ఉన్నా రాత్రి వేళల్లో చలి గాలులు వీస్తున్నాయి.


