News February 3, 2025

పెద్దపల్లి జిల్లాలో ఉష్ణోగ్రతలు..

image

పెద్దపల్లి జిల్లాలో రోజురోజుకు చలి తీవ్రత తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో అత్యల్పంగా కాల్వ శ్రీరాంపూర్ 16.9℃, ఓదెల 17.0, రామగుండం 17.1, మంథని 17.1, కమాన్పూర్ 17.4, సుల్తానాబాద్ 17.5, జూలపల్లి 17.5, అంతర్గాం 17.7, పెద్దపల్లి 17.7, ఎలిగేడు 18.0, ధర్మారం 18.3, పాలకుర్తి 18.5, రామగిరి 19.2, ముత్తారం 20.2℃గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Similar News

News October 25, 2025

HEADLINES

image

* కర్నూలులో ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది మృతి
* ఘటనపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, రేవంత్ దిగ్భ్రాంతి
* మావోయిజం, నక్సలిజం లేకుండా చేస్తాం: మోదీ
* దేశంలో క్వాంటం వ్యాలీ ఉండే ఏకైక ప్రాంతం AP: CBN
* బంగాళాఖాతంలో ఈనెల 27న ఏర్పడనున్న తుఫాన్.. అత్యంత భారీ వర్షాలకు అవకాశం
* భారీగా తగ్గిన వెండి ధరలు

News October 25, 2025

మున్సిపాలిటీలకు రూ.2,780 కోట్ల నిధులు విడుదల

image

TG: రాష్ట్రంలో మున్సిపాలిటీలకు రూ.2,780 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. 138 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 2,432 పనులకు ఆమోదం తెలిపింది. వెంటనే టెండర్లు పిలిచి పనులు చేపట్టాలని సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. కొత్త, పాత మున్సిపాలిటీలకు రూ.15 కోట్లు, అదనంగా గ్రామ పంచాయతీలు విలీనమైన మున్సిపాలిటీలకు రూ.20 కోట్లు, కొత్తగా ఏర్పాటైన మున్సిపల్ కార్పొరేషన్లకు రూ.30 కోట్ల చొప్పున రిలీజ్ చేశారు.

News October 25, 2025

రాష్ట్రంలో జాయింట్ కలెక్టర్ పదవి రద్దు

image

TG: గతంలో ఉన్న జాయింట్ కలెక్టర్ పదవిని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు అన్ని జిల్లాల అదనపు కలెక్టర్ల(రెవెన్యూ)ను ఫారెస్ట్ సెటిల్‌మెంట్ ఆఫీసర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అటవీ భూ సర్వే, హక్కుల నిర్ధారణ, సెటిల్‌మెంట్ పనులను వీరి పరిధిలోకి తెచ్చింది. అటవీ భూముల పరిరక్షణకు అన్ని జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.