News February 6, 2025

పెద్దపల్లి జిల్లాలో ఉష్ణోగ్రత వివరాలు..

image

పెద్దపల్లి జిల్లాలో రోజురోజుకు చలి తీవ్రత తగ్గుముఖం పడుతుంది. గడచిన 24 గంటల్లో అత్యల్పంగా సుల్తానాబాద్ 18.0℃, రామగుండం 18.3, ఓదెల 18.3, కాల్వ శ్రీరాంపూర్ 18.6, మంథని 18.7, అంతర్గం 18.8, పాలకుర్తి 18.9, ఎలిగేడు 19.2, జూలపల్లి 19.2, ధర్మారం 19.7, పెద్దపల్లి 19.7, కమాన్పూర్ 20.4, రామగిరి 21.9, ముత్తారం 22.1℃గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Similar News

News February 6, 2025

దస్తగిరి రెడ్డి ఫిర్యాదు.. విచారణకు ఆదేశించిన ప్రభుత్వం

image

తనని జైలు సూపరింటెండెంట్ ప్రకాశ్ జైలులో ఇబ్బంది పెట్టారని వైఎస్ వివేకానంద హత్య కేసులో అప్రూవర్‌ మారిన దస్తగిరి రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. డాక్టర్ చైతన్య రెడ్డి తనకు రూ.20 కోట్లు ఆఫర్ చేశారని తెలిపారు. రేపు ఉదయం కడప జైలులో దస్తగిరి రెడ్డితో పాడు వారిద్దరినీ విచారణ అధికారి రాహుల్ ప్రశ్నించనున్నారు.

News February 6, 2025

10న ఆల్బెండజోల్ మాత్రలను అందించండి: భద్రాద్రి కలెక్టర్

image

జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్‌ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయం సమావేశ మందిరంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 10న నిర్వహించనున్న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం రోజున 1 నుంచి 19 సంవత్సరాల వయసు గల వారందరికీ నులిపురుగులను నివారించే ఆల్బెండజోల్ మాత్రలను అందించాలన్నారు.

News February 6, 2025

ADB: నాగోబా ఆలయ హుండీ లెక్కింపు

image

కేస్లాపూర్‌లోని నాగోబా జాతర హుండీ లెక్కింపును గురువారం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో మెస్రం వంశీయులు, ఆలయ కమిటీ, రెవెన్యూ, దేవాదాయ, ఐటీడీఏ, పోలీస్‌ శాఖ అధికారుల సమక్షంలో హుండీ ఆదాయాన్ని లెక్కించారు. మొత్తం ఆదాయం రూ.21,08,511 వచ్చినట్లు దేవాదాయ శాఖ ఈవో రాజమౌళి తెలిపారు. పీఠాధిపతి వెంకట్‌రావ్‌ పటేల్‌, దేవాదాయశాఖ సీఎఫ్‌వో రవి, ఆలయ కమిటీ ఛైర్మన్ ఆనంద్ రావు తదితరులున్నారు.

error: Content is protected !!