News March 11, 2025

పెద్దపల్లి జిల్లాలో ఉష్ణోగ్రతలు ఇలా

image

పెద్దపల్లి జిల్లాలో ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా రామగిరి 37.6℃ నమోదు కాగా కమాన్పూర్ 37.3, ముత్తారం 37.1, మంథని 36.8, పాలకుర్తి 35.8, కాల్వ శ్రీరాంపూర్ 35.3, ఓదెల 35.1, అంతర్గాం 35.0, రామగుండం 34.6, పెద్దపల్లి 34.4, సుల్తానాబాద్ 34.2, ధర్మారం 33.4, ఎలిగేడు 32.6, జూలపల్లి 32.2℃ గా నమోదయ్యాయి. ఇక ఉదయం 10 దాటితే జిల్లాలో ఎండ తీవ్రత భారీగా పెరుగుతుంది.

Similar News

News November 28, 2025

ప.గో: టీచర్‌గా మారిన కలెక్టర్ చదలవాడ

image

విద్యార్థుల భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. శుక్రవారం తణుకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి, 10వ తరగతి విద్యార్థులతో మమేకమై ఆమె కొద్దిసేపు టీచర్‌గా మారారు. గడిచిపోయిన రోజు తిరిగి రాదని, ఎప్పటి పాఠాలు అప్పుడే చదువుకోవాలని హితవు పలికారు. విజ్ఞానాన్ని పెంచుకోవడానికి మాత్రమే సెల్‌ఫోన్ వినియోగించాలని ఆమె కోరారు.

News November 28, 2025

గద్వాల: పదవుల వేలం వేస్తే కఠిన చర్యలు: కలెక్టర్‌

image

గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని కలెక్టర్ సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు. సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు వేలం వేయడం వంటి చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వేలం, బెదిరింపులకు పాల్పడడాన్ని ఎన్నికల నేరాలుగా పరిగణించబడతాయని, వీటికి సెక్షన్ 171-E, 171-F ప్రకారం ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు.

News November 28, 2025

గద్వాల: జీపీ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి: కలెక్టర్

image

గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు ఎక్కడైనా వేలం వేసే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడం కమిషన్ లక్ష్యమన్నారు. నామినేషన్ సమయంలో ఎవరినీ ప్రలోభాలకు గురి చేయరాదని ఆయన స్పష్టం చేశారు.