News March 14, 2025
పెద్దపల్లి జిల్లాలో ఉష్ణోగ్రతలు ఇలా

పెద్దపల్లి జిల్లాలో ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా రామగిరి 40.2℃ నమోదు కాగా మంథని 40.1, అంతర్గం 40.0, ముత్తారం 39.9, పాలకుర్తి 39.7, కమాన్పూర్ 39.6, రామగుండం 39.5, పెద్దపల్లి 39.5, కాల్వ శ్రీరాంపూర్ 39.4, సుల్తానాబాద్ 39.3, ఓదెల 39.3, ధర్మారం 38.6, జూలపల్లి 36.7, ఎలిగేడు 36.5℃ గా నమోదయ్యాయి. ఇక 10 దాటితే జిల్లాలో ఎండ తీవ్రత భారీగా పెరుగుతుంది.
Similar News
News October 20, 2025
NLG: టార్గెట్ రీచ్ అవుతారా..!

మద్యం షాపుల టెండర్లకు ప్రభుత్వం మరోసారి గడువు పొడిగించినా మద్యం వ్యాపారుల నుంచి అంతగా స్పందన కానరావడం లేదు. జిల్లాలో 154 మద్యం దుకాణాలకు సర్కారు ఆశించిన దానికంటే తక్కువ సంఖ్యలో (4,620) దరఖాస్తులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతేడాది 155 దుకాణాలకు 7,057 దరఖాస్తులు వచ్చాయి. ఎలాగైనా టార్గెట్ చేరుకోవాలనే సంకల్పంతో ఎక్సైజ్ శాఖ క్షేత్రస్థాయిలో పావులు కదుపుతోంది.
News October 20, 2025
దగడలో అత్యధిక వర్షపాతం

వనపర్తి జిల్లాలోని 21 వర్షపాతం నమోదు కేంద్రాలలో ఆదివారం ఉదయం నుండి సోమవారం ఉదయం వరకు కేవలం రెండు కేంద్రాలలోనే వర్షపాతం నమోదైంది. అత్యధికంగా దగడలో 3.0 మిల్లీమీటర్లు, శ్రీరంగాపురంలో 2.8 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డైంది. మిగిలిన 19 కేంద్రాలలో 0.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
News October 20, 2025
కాగజ్నగర్కు ఆకాశ అతిథులు వచ్చారు..!

కాగజ్నగర్ డివిజన్లోని అడవుల్లో వలస పక్షులు పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. హిమాలయాల నుంచి వచ్చిన పెయింటెడ్ స్టార్క్ కొంగలు, ఆసియా ఖండంలో తిరిగే ఓపెన్ బిల్డ్ స్టార్క్, పశ్చిమాసియాలో ఉండే బ్లూ ప్రొటెడ్ ఫైక్యాచర్ పక్షులు కొన్ని రోజులుగా కాగజ్నగర్ అడవుల్లో తిరుగుతున్నాయి. వివిధ రకాల పక్షులను వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ రాజేశ్ కన్నీ తన కెమెరాలో బంధించారు.