News March 16, 2025
పెద్దపల్లి జిల్లాలో ఉష్ణోగ్రతలు ఇలా

పెద్దపల్లి జిల్లాలో ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా మంథని 40.8℃ నమోదు కాగా రామగిరి 40.6, పాలకుర్తి 40.5, అంతర్గం 40.4, కమాన్పూర్ 40.3, సుల్తానాబాద్ 40.2, ఓదెల 40.1, ముత్తారం 39.7, కాల్వ శ్రీరాం 39.5, రామగుండం 39.4, పెద్దపల్లి 39.3, ధర్మారం 38.4, ఎలిగేడు 37.7, జూలపల్లి 36.3℃ గా నమోదయ్యాయి. ఇక 10 దాటితే ఎండ తీవ్రత విపరీతంగా పెరుగుతుంది.
Similar News
News November 19, 2025
VJA: సారు.. కారు దిగరు.. కంటి చూపుతోనే తనిఖీలు.!

తాడిగడప-ఎనికేపాడు 100ఫీట్ రోడ్డులో AMVI రమణారావు తనిఖీలు నిర్వహిస్తున్న తీరు చర్చనీయాంశమైంది. ACకారులో కూర్చొని, వాహనం దిగకుండానే కంటిచూపుతోనే ఫిట్నెస్ పరిశీలన చేయడం గమనార్హం. రవాణా శాఖాధికారులు వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత ఫైన్ వేయాలి. కానీ ఉమ్మడి కృష్ణా జిల్లాలో అధికారులు ఇలా కార్లలో కూర్చొని తూతూమంత్రంగా తనిఖీలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
News November 19, 2025
అన్నదాతకు ప్రభుత్వం అండ: కలెక్టర్

అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ 2025-26 2వ విడత కింద జిల్లాలో 2,72,757 మంది రైతులకు రూ.181.51 కోట్లు జమయ్యాయని కలెక్టర్ డా. ఏ.సిరి తెలిపారు. కోడుమూరు ఆర్.కొంతలపాడులో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్, ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పాల్గొన్నారు. ఉల్లి, మిర్చి, పత్తి పంటల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందిస్తోందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 11 పత్తి మిల్లులు పనిచేస్తున్నాయన్నారు.
News November 19, 2025
రిస్క్లో 350 కోట్లమంది వాట్సాప్ కాంటాక్ట్స్?

డేటా లీకేజీతో వాట్సాప్ వినియోగదారుల ప్రైవసీ ప్రమాదంలో పడనున్నట్లు వియన్నా యూనివర్సిటీ హెచ్చరించింది. ఆ యూనివర్సిటీ రీసెర్చర్స్ వాట్సాప్లో భారీ భద్రతా లోపాన్ని గుర్తించారు. వరల్డ్ వైడ్గా ఉన్న 350 కోట్లమంది యూజర్ల కాంటాక్ట్స్ లీక్ అయ్యే ప్రమాదం ఉన్నట్లు వార్నింగ్ ఇచ్చారు. హ్యాకర్లు లేదా వేరే వ్యక్తులు ఈ కాంటాక్ట్ నంబర్లను చోరీ చేసే అవకాశమున్నట్లు తెలిపారు.


