News March 18, 2025
పెద్దపల్లి జిల్లాలో ఉష్ణోగ్రతలు ఇలా..!

పెద్దపల్లి జిల్లాలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా ముత్తారం 40.1℃ నమోదు కాగా మంథని 40.1, రామగిరి 40.0, అంతర్గం 40.0, కాల్వ శ్రీరాంపూర్ 39.8, రామగుండం 39.7, ఓదెల 39.7, పాలకుర్తి 39.6, కమాన్పూర్ 39.3, సుల్తానాబాద్ 38.4, ధర్మారం 38.3, పెద్దపల్లి 36.6, ఎలిగేడు 35.7, జూలపల్లి 35.4℃ గా నమోదయ్యాయి. ఇక 10 దాటితే జిల్లాలో ఎండ తీవ్రత భారీగా పెరుగుతుంది.
Similar News
News December 9, 2025
జడ్చర్ల: పంచాయతీ ఏర్పడిన ఐదేళ్లకు ఎన్నికలు

జడ్చర్ల మండలం బండమీదిపల్లి గ్రామం ప్రత్యేక గ్రామపంచాయతీగా ఏర్పడిన తర్వాత 2020 డిసెంబర్ 20 నుంచి ప్రత్యేక అధికారి పాలనలో నడుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తుండడంతో గ్రామంలో మూడో విడత ఎన్నికల నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సమస్యలు తీరి గ్రామ సర్పంచ్ పాలనలో గ్రామ అభివృద్ధి చెందిందని గ్రామస్థులు ఆశాభావం వ్యక్తం చేశారు.
News December 9, 2025
శబరిమల: 18 మెట్లు – వాటి పేర్లు

1.అణిమ, 2.లఘిమ, 3.మహిమ, 4.ఈశత్వ, 5.వశత్వ, 6.ప్రాకామ్య, 7.బుద్ధి, 8.ఇచ్ఛ, 9.ప్రాప్తి, 10.సర్వకామ, 11.సర్వ సంవత్సర, 12.సర్వ ప్రియకర, 13.సర్వ మంగళాకార, 14.సర్వ దుఃఖ విమోచన, 15.సర్వ మృత్యుత్వశమన, 16.సర్వ విఘ్న నివారణ, 17.సర్వాంగ సుందర, 18.సర్వ సౌభాగ్యదాయక. ఈ 18 పేర్లు సిద్ధులు, సర్వ శుభాలకు ప్రతీక. ఇవి దాటితే అన్ని రకాల సౌభాగ్యాలను, విఘ్న నివారణను పొందుతారని నమ్మకం. <<-se>>#AyyappaMala<<>>
News December 9, 2025
ఎంజీఎంలో టెండర్లు ఉండవా ?

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో గుత్తేదారులతో హవా నడుస్తోంది. కాల పరిమితి ముగిసినా టెండర్లు పిలవకపోవడంతో పాత కాంట్రాక్టు సంస్థలకే కట్టబెడుతున్నారు. శానిటేషన్ టెండర్ ముగిసినా గత 3 నెలలుగా వారితోనే సిబ్బంది వేతనాలు కోతలతో చెల్లిస్తున్నా అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. స్టేషనరీ, సర్జికల్, మెడికల్ టెండర్లు పిలవకపోవడంతో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపణలు ఉన్నాయి.


