News January 29, 2025
పెద్దపల్లి జిల్లాలో గృహజ్యోతి చెల్లింపుల వివరాలు

పెద్దపల్లి జిల్లాలో గృహజ్యోతి పథకానికి సంబంధించిన చెల్లింపులపై అధికారులు వివరణ ఇచ్చారు. జిల్లాలో గృహజ్యోతి పథకానికి అర్హులైన ఇళ్ల కనెక్షన్లు 1.30 లక్షలకు పైగా ఉన్నట్లు వెల్లడించారు. జిల్లాలో గృహజ్యోతి పథకం కింద ప్రభుత్వం రూ.51.19 కోట్ల చెల్లింపులు చేసినట్లు పేర్కొన్నారు. కాగా, జిల్లా వ్యాప్తంగా 14 మండలాల్లో మొత్తంగా 2.14 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి.
Similar News
News February 19, 2025
బుల్లెట్ బ్యాక్ ఫైర్.. బాపట్ల జిల్లా జవాన్ మృతి

బాపట్ల జిల్లా పిట్టలవారిపాలెం మండలం గౌడపాలెంకు చెందిన 16వ కవలరి రెజిమెంట్ జవాన్ పరిసా వెంకటేశ్ మంగళవారం మృతి చెందాడు. రాజస్థాన్ ఫీల్డ్ ఫైరింగ్ ప్రాక్టీస్‌లో బుల్లెట్ బ్యాక్ ఫైర్‌తో అతను మృతిచెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. సూరత్ గర్ మిలిటరీ హాస్పిటల్ నుంచి బుధవారం వెంకటేశ్ పార్థివదేహం గుంటూరుకు హెలికాప్టర్‌లో వస్తున్నట్లు తెలిపారు. ఆయన మృతిపై పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
News February 19, 2025
ప్రకాశం జిల్లాలో నేటి నుంచి ఆధార్ క్యాంపులు

ప్రకాశం జిల్లా పరిధిలో ఇవాళ్టి నుంచి ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నారు. ప్రతి మండలంలో సెలక్ట్ చేసిన సచివాలయాల్లో ఆధార్ సేవలు అందిస్తారు. కొత్తగా ఆధార్ కార్డు నమోదు, పాత కార్డులో వివరాల అప్‌డేట్, మొబైల్ లింకింగ్, చిన్న పిల్లల ఆధార్ నమోదు తదితర సేవలు అందుబాటులో ఉన్నాయి. మీకు దగ్గరలోని సచివాలయాలను సంప్రదిస్తే.. ఏ సచివాలయంలో ఆధార్ సేవలు అందిస్తారో మీకు చెబుతారు.
News February 19, 2025
వనపర్తి జిల్లాలో నాలుగువేల కోళ్లు మృత్యువాత

వనపర్తి జిల్లా మదనాపురం మండలం కొన్నూరు గ్రామానికి చెందిన ఓ రైతు కోళ్ల ఫామ్‌లో అకస్మాత్తుగా సుమారు 4వేల కోళ్లు మృతి చెందడంతో పెంపకందారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఉన్నట్టుండి కోళ్లు మృతి చెందడంతో బర్డ్ ఫ్లూ వచ్చిందా లేక ఇంకే కారణంతోనైనా చనిపోయాయా అని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పశువైద్యాధికారులు పరిశీలించి కారణమేమిటో గుర్తించి, ప్రభుత్వం తమను ఆదుకోవాలని పెంపకందారులు కోరుతున్నారు.