News February 13, 2026

పెద్దపల్లి జిల్లాలో పార్టీల వారీగా విజేతల వివరాలు..!

image

పెద్దపల్లి జిల్లాలో 124 వార్డు స్థానాలు ఉండగా రామగుండం కార్పొరేషన్ లో ఒక డివిజన్ ఏకగ్రీవమైంది. మిగతా 123 వార్డులకు జరిగిన ఎన్నికలలో పార్టీల వారీగా బలాబలాలు ఈ విధంగా ఉన్నాయి. కాంగ్రెస్ – 89, BRS – 16, BJP- 3, AIFB- 13, CPI- 1, స్వతంత్ర అభ్యర్థులు- 2 స్థానాలలో విజయం సాధించారు.

Similar News

News March 14, 2026

నల్గొండలో 40 డిగ్రీలు దాటిన ఎండలు

image

నల్గొండ జిల్లాలో వేసవి ఎండలు తీవ్రంగా పెరుగుతున్నాయి. మార్చి రెండో వారంలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40.4 డిగ్రీలకు చేరడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గడిచిన రెండు రోజులుగా ఎండ తీవ్రత గణనీయంగా పెరిగింది. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వాతావరణ శాఖ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ప్రజలు ఎండల నుంచి జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.

News March 14, 2026

దారుణం.. యువతికి HIV రక్తం ఎక్కించాడు!

image

TG: HIV సోకిన ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. మేడ్చల్ (D) అన్నోజిగూడలో ఇటీవల మనోహర్ అనే యువకుడికి ఓ యువతితో నిశ్చితార్థం జరిగింది. అతడికి HIV పాజిటివ్ అని తెలియడంతో అమ్మాయి పేరెంట్స్ పెళ్లికి నిరాకరించారు. కక్ష పెంచుకున్న మనోహర్ ఈనెల 11న యువతి ఇంటికి వెళ్లి సిరంజితో ఆమెకు HIV ఉన్న రక్తాన్ని ఎక్కించాడు. ఇటీవల యువతికి జ్వరం రావడంతో విషయం బయటపడింది. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

News March 14, 2026

అల్లూరి: ఓపెన్ టెన్త్‌కు 15 సెంటర్స్

image

ఈ నెల 16 నుంచి ప్రారంభమయ్యే ఓపెన్ టెన్త్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని పరీక్షల కమిషనర్ శశికుమార్ శనివారం తెలిపారు. అల్లూరి జిల్లాలో 15 కేంద్రాల్లో 1,417మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని తెలిపారు. అల్లూరి జిల్లా నుంచి 1,003, పోలవరం జిల్లా నుంచి 414 మంది పరీక్షలు రాస్తున్నారన్నారు. ఆరు సబ్జెక్ట్‌లో పరీక్షలు ఈ నెల 27వరకు జరుగుతాయి. కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు.