News March 12, 2025
పెద్దపల్లి జిల్లాలో భగ్గుమంటున్న భానుడు

వేసవి నేపథ్యంలో పెద్దపల్లి జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతోంది. బుధవారం ముత్తారం మండలంలో సరాసరి గరిష్ఠ ఉష్ణోగ్రత 37.6℃గా నమోదైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అటు చలి తీవ్రత కూడా తగ్గడంతో కాల్వ శ్రీరాంపూర్ మండలంలో 19.1℃ సరాసరి కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా, ఇప్పటికే జిల్లా ప్రజలు ఉక్కుపోతతో ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం సమయంలో తీవ్రత మరింత ఎక్కువగా ఉంటోంది.
Similar News
News March 13, 2025
పుష్ప 2 తొక్కిసలాట: ప్రస్తుతం శ్రీతేజ్ ఎలా ఉన్నాడంటే..

హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద పుష్ప2 రిలీజ్ రోజు తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డ శ్రీతేజ్ వెంటిలేటర్ లేకుండా శ్వాస తీసుకుంటున్నాడు. కానీ నాడీ వ్యవస్థ దెబ్బతిని మాటలు అర్థం చేసుకోలేక, కుటుంబీకులను గుర్తించలేకపోతున్నాడు. స్పర్శ కూడా తెలియడం లేదని డాక్టర్లు చెప్పారని BBC కథనంలో పేర్కొంది. నేరుగా పొట్టలోకి ట్యూబ్ అమర్చే ఎండోస్కోపిక్ గ్యాస్ట్రోస్ట్రోమీ ప్రక్రియతో ఆస్పత్రి సిబ్బంది ఆహారం పంపిస్తున్నారు.
News March 13, 2025
HMDA పరిధి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు

TG: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ(HMDA) పరిధిని విస్తరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా 3వేల చ.కి.మీ భూభాగం చేర్చుతున్నట్లు పేర్కొంది. దీంతో మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వికారాబాద్, నల్గొండలోని 16 మండలాలు విలీనం కానున్నాయి. ప్రస్తుతం HMDA పరిధిలో 11 జిల్లాలు, 104 మండలాలు, 1350 గ్రామాలు ఉన్నాయి.
News March 13, 2025
‘ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్యంశాలు’

∆} సత్తుపల్లి: ‘మద్యం మత్తులో ఢీ.. ఇద్దరికి గాయాలు’ ∆} ఖమ్మం: కేంద్రమంత్రికి మంత్రి తుమ్మల లేఖ ∆} సత్తుపల్లి: పురుగు మందుతో రైలు పట్టాలపై ఆందోళన ∆} వైరాలో ప్రమాదం.. ఒకరు మృతి ∆} ఖమ్మం: ఐదుగురికి షోకాజ్ నోటీసులు ∆}ఖమ్మం: ఇంటర్ వార్షిక పరీక్షల మూల్యాంకనం ∆}ఖమ్మం: ఎలక్ట్రికల్ షాప్‌లో అగ్ని ప్రమాదం భారీగా ఆస్తి నష్టం ∆} ఖమ్మం: ‘ప్రభుత్వం విద్యా రంగాన్ని బలోపేతం చేయాలి’.