News March 17, 2025
పెద్దపల్లి జిల్లాలో భగ్గుమంటున్న భానుడు

వేసవి నేపథ్యంలో పెద్దపల్లి జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతోంది. సోమవారం కాల్వ శ్రీరాంపూర్ మండలంలో సరాసరి గరిష్ఠ ఉష్ణోగ్రత 40.9℃గా నమోదైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అటు చలి తీవ్రత కూడా తగ్గడంతో ఓదెల మండలంలో 18.0℃ సరాసరి కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా, ఇప్పటికే జిల్లా ప్రజలు ఉక్కుపోతతో ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం సమయంలో వేడి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటోంది.
Similar News
News November 15, 2025
విశాఖలో రెండో రోజు CII సమ్మిట్

విశాఖలో CII సమ్మిట్ నేటితో ముగియనుంది. నిన్న సుమారు 400 MOUలు జరగ్గా.. నేడు గూగుల్, శ్రీ సిటీ, రేమండ్, ఇండోసోల్ వంటి ప్రాజెక్టుల శంకుస్థాపనలు చేయనున్నారు. న్యూజిలాండ్, జపాన్, కెనడా, మెక్సికో ప్రతినిధులతో CM చంద్రబాబు భేటీ కానున్నారు. గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ, సస్టైనబుల్ సిటీస్, ‘ఆంధ్ర టూరిజం విజన్’ సెషన్లు చేపట్టనున్నారు. మంత్రి లోకేశ్ అధ్యక్షతన ‘AI అండ్ ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్’పై ముఖ్య చర్చ జరగనుంది.
News November 15, 2025
రెండో రోజు CII సదస్సు ప్రారంభం

AP: విశాఖలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సీఐఐ సదస్సు రెండో రోజు ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఏయూ ఇంజినీరింగ్ కాలేజీలో జరుగుతున్న రేమండ్ ఫౌండేషన్ ప్రోగ్రామ్‌కు సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఇవాళ దేశ విదేశాలకు చెందిన పలు కంపెనీల ప్రతినిధులతో సీఎం భేటీ అవుతారు.
News November 15, 2025
జూబ్లీహిల్స్: స్వతంత్ర అభ్యర్థులందరికీ కలిపి పోలైన ఓట్లు 1,608

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో నిలవగా అందులో 29 మంది స్వతంత్రులు ఉన్నారు. పోటీ చేసిన వారిలో 10 మందికి పైగా నిరుద్యోగులున్నారు. వారంతా రెండంకెల ఓట్లకే పరిమితమయ్యారు. స్వతంత్ర అభ్యర్థులందరికీ కలిపి పోలైన ఓట్లు 1,608. బరిలో నిలిచిన వారిలో 41 మంది అభ్యర్థులకు రెండంకెల ఓట్లు, ఒక స్వతంత్ర అభ్యర్థికి 9 ఓట్లు పోలయ్యాయి.


