News March 17, 2025

పెద్దపల్లి జిల్లాలో భగ్గుమంటున్న భానుడు

image

వేసవి నేపథ్యంలో పెద్దపల్లి జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతోంది. సోమవారం కాల్వ శ్రీరాంపూర్ మండలంలో సరాసరి గరిష్ఠ ఉష్ణోగ్రత 40.9℃గా నమోదైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అటు చలి తీవ్రత కూడా తగ్గడంతో ఓదెల మండలంలో 18.0℃ సరాసరి కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా, ఇప్పటికే జిల్లా ప్రజలు ఉక్కుపోతతో ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం సమయంలో వేడి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటోంది.

Similar News

News April 20, 2025

DSC: ఉమ్మడి ప.గో జిల్లాలో ఎన్ని పోస్టులంటే?

image

రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 16,347 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 1035 కొలువులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో ఎస్ఏ తెలుగు 49, హిందీ 48, ఇంగ్లీష్ 85, మ్యాథ్స్ 45, ఫిజిక్స్ 42, జీవశాస్త్రం 59, సోషల్ 102, పీడీ 185, ఎస్జీటీ 417, ఎస్జీటీ ఉర్దూ 3 పోస్టులున్నాయి.

News April 20, 2025

DSC: ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఖాళీలు ఎన్నంటే?

image

రాష్ట్రంలో 16,347 పోస్టులతో ఇవాళ 10 గంటలకు మెగా DSC నోటిఫికేషన్ వెలువడనుంది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ➱SA LANG-1: 14, ➱HINDI: 14, ➱ENG: 23, ➱MATHS: 08, ➱PS: 32, ➱BS: 20, ➱SOCIAL: 62, ➱PE:63, ➱SGT: 210, ➱TOTAL: 446 ఉన్నాయి. అలాగే గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలకు సంబంధించి ➱ENG:07, ➱MATHS:25, ➱PS:24, ➱BS:16, ➱SOCIAL:05, ➱SGT: 60, ➱TOTAL:137 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

News April 20, 2025

HYD: ఫ్యాన్సీ నంబర్స్ వేలం ద్వారా భారీ ఆదాయం

image

ఫ్యాన్సీ నంబర్స్ వేలం ద్వారా తెలంగాణ రవాణాశాఖ కొత్త రికార్డులను సృష్టిస్తోంది. శనివారం జరిగిన ఫ్యాన్సీ నంబర్ల వేలంలో ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం ఒక్క రోజులోనే రూ.3.71 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం మొత్తం 50కు పైగా ఫ్యాన్సీ నంబర్లు వేలంలో అమ్మకమయ్యాయని ఆర్టీఏ అధికారులు తెలిపారు. ప్రత్యేకంగా 9999, 0001, 6666, 7777 వంటి నంబర్లకు విపరీతమైన డిమాండ్ ఉందని తెలిపారు.

error: Content is protected !!