News March 2, 2025
పెద్దపల్లి: జిల్లాలో మార్చి 10-15 వరకు ప్రత్యేక పరిశుద్ధ్య డ్రైవ్: కలెక్టర్

మార్చి 10 నుంచి 15 వరకు గ్రామ పంచాయతీలలో ప్రత్యేక పరిశుద్ధ్య డ్రైవ్ నిర్వహించాలని సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ లో భాగంగా ప్లాస్టిక్, చెత్త ఉండకుండా శుభ్రం చేయాలన్నారు. పిచ్చి మొక్కలను పూర్తిస్థాయిలో తొలగించాలని అన్నారు. గ్రామాలలో ఎక్కడ తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
Similar News
News December 1, 2025
HYD: రాజ్ భవన్.. లోక్ భవన్‌గా మారనుందా?

సోమాజిగూడలోని గవర్నర్ అధికారిక నివాసం రాజ్ భవన్ ఇకనుంచి లోక్‌భవన్‌గా మారే అవకాశం ఉంది. గవర్నర్లు నివాసం ఉంటున్న రాజ్‌భవన్ పేరును లోక్‌భవన్‌గా కేంద్రం మార్చాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అధికారికంగా ఆదేశాలు ఇవ్వకపోయినా.. కేంద్రం సూచనల మేరకు ఇప్పటికే తమిళనాడు, పశ్చిమబెంగాల్లోని రాజ్భవన్లు లోక్‌భవన్‌గా మారాయి. ఈ క్రమంలో మన రాజ్‌భవన్ కూడా పేరు మారుతుందా అనే చర్చ సాగుతోంది.
News December 1, 2025
2.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు: కలెక్టర్

తూ.గో జిల్లాలో 2 లక్షల 10వేల 210 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి సోమవారం ప్రకటించారు. ఈ ఖరీఫ్‌లో ధాన్యం సేకరణకు సంబంధించి 42,822 కూపన్లను జనరేట్ చేసినట్లు చెప్పారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే 11,767 మంది రైతులకు రూ.2,0246 కోట్లను చెల్లించామన్నారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలన్నారు.
News December 1, 2025
ఆదిలాబాద్: గుర్తుల పంచాయితీ!

పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తులుండవు. సర్పంచ్‌కు గులాబీ రంగు, వార్డు సభ్యులకు తెలుపు రంగు బ్యాలెట్ పేపర్లు కీలకం కానున్నాయి. సర్పంచ్ గుర్తుల్లో ఉంగరం, కత్తెర బాగానే ఉన్నా, బ్యాట్, టీవీ రిమోట్లు, సాసర్, పలక, బ్లాక్ బోర్డు వంటివి ఒకేలా ఉండటంతో ఓటర్లు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది. ప్రచారం సరిగా చేయకపోతే ఓట్లు మారే ప్రమాదం ఉంది.


