News February 9, 2025

పెద్దపల్లి జిల్లాలో మొదలైన ఎన్నికల సందడి

image

పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించేందుకు కసరత్తు చేస్తుండటంతో గ్రామాల్లో ఆశావహులు తమదైన రీతిలో ప్రచారం మొదలు పెట్టారు. పలు చోట్ల మాజీ సర్పంచులతో పాటు.. యువకులు, ఇతరులు ఎన్నికల్లో నెగ్గేందుకు మంతనాలు ప్రారంభించారు. అంతేకాదు, ఈ ఎన్నికల్లో తమకు అవకాశం ఇవ్వాలని పలువురు ప్రధాన నేతలను కలుస్తున్నారు.

Similar News

News November 21, 2025

గులాం రసూల్ సేవలు మరువలేనివని: పల్లె శేఖర్ రెడ్డి

image

పేదల ఆశాజ్యోతి గులాం రసూల్ సేవలు మరువలేనివని సీపీఐ యాదాద్రి జిల్లా కార్యవర్గ సభ్యుడు పల్లె శేఖర్ రెడ్డి అన్నారు. రసూల్ 10వ వర్ధంతి సందర్భంగా చౌటుప్పల్ సీపీఐ కార్యాలయంలో నివాళులర్పించారు. రాచకొండ ఫైరింగ్ రేంజ్ వ్యతిరేక ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారని, గిరిజనులకు ఆదర్శంగా నిలిచారని చెప్పారు. జడ్పీటీసీ, MPTCగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన నాయకుడు అన్నారు.

News November 21, 2025

రాజమండ్రి: ఆర్టీసీకి రూ.32 లక్షల ఆదాయం

image

కార్తీక మాసం నేపథ్యంలో ఆర్టీసీకి కాసుల పంట పండింది. కార్తీకం వేళ జిల్లాలో ఉన్న డిపోల నుంచి 36 బస్సులు నడపడం ద్వారా రూ.32 లక్షల ఆదాయం వచ్చిందని డీపీటీవో మూర్తి శుక్రవారం తెలిపారు. శబరిమలకు 8 బస్సులు, పంచారామాలకు 13 బస్సులు, ఏకాదశి రుద్రులు, నవ నందులు, శివ కేశవ దర్శిని, కోనసీమ స్పెషల్‌గా 15 బస్సులు నడిపామన్నారు. అయ్యప్ప భక్తుల కోసం, అలాగే ధనుర్మాసంలో బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధంగా ఉందన్నారు.

News November 21, 2025

పారిశ్రామికవేత్తలుగా SHG మహిళలకు ప్రోత్సాహం: మంత్రి కొండపల్లి

image

AP: SHG మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని, సకాలంలో బ్యాంకు రుణాలు అందేవిధంగా చర్యలు చేపట్టాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 39,000 మందికి పైగా మహిళలు రూ.578 కోట్లతో వ్యాపారాలు ప్రారంభించారని, 2026 మార్చి నాటికి SHGలకు రూ.32,322 కోట్ల రుణాలు అందజేయాలన్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలను బలోపేతం చేసి, మద్దతు ఇవ్వాలని సూచించారు.