News February 9, 2025

పెద్దపల్లి జిల్లాలో మొదలైన ఎన్నికల సందడి

image

పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించేందుకు కసరత్తు చేస్తుండటంతో గ్రామాల్లో ఆశావహులు తమదైన రీతిలో ప్రచారం మొదలు పెట్టారు. పలు చోట్ల మాజీ సర్పంచులతో పాటు.. యువకులు, ఇతరులు ఎన్నికల్లో నెగ్గేందుకు మంతనాలు ప్రారంభించారు. అంతేకాదు, ఈ ఎన్నికల్లో తమకు అవకాశం ఇవ్వాలని పలువురు ప్రధాన నేతలను కలుస్తున్నారు.

Similar News

News March 15, 2025

దుర్గాప్రసాద్ ఫ్యామిలీకి అండగా ఉంటాం: పవన్ కళ్యాణ్

image

అమలాపురం నియోజకవర్గం ఈదరపల్లికి చెందిన జన సైనికుడు అడపా దుర్గాప్రసాద్ ఆత్మకు శాంతి చేకూరాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. ‘జనసేన సభ నుంచి వెళ్తూ దుర్గాప్రసాద్ చనిపోయారని తెలిసి చింతిస్తున్నా. అతని కుటుంబానికి జనసేన అన్ని విధాలా అండగా ఉంటుంది’ అని పవన్ అన్నారు. పిఠాపురంలో నిన్న దుర్గాప్రసాద్‌కు కళ్లు తిరగ్గా.. బస్సులో కూర్చోపెట్టారు. ఇంటికి వచ్చాక గుండెపోటుతో చనిపోయారని స్థానికులు తెలిపారు.

News March 15, 2025

నిజామాబాద్: ఆర్టీసీ కార్గో ద్వారా ఇంటికే రాములోరి తలంబ్రాలు

image

నిజామాబాద్ ఆర్టీసీ కార్గో ద్వారా ఇంటికే భద్రాచలం శ్రీసీతారాముల కల్యాణ తలంబ్రాలను అందజేయనున్నట్లు ఏటీఎం శనివారం తెలిపారు. ఏప్రిల్ 6న శ్రీరామ నవమి సందర్భంగా స్వామివారికి వినియోగించిన ముత్యాలు, తలంబ్రాలు మార్చి 14 నుంచి రూ.151 చెల్లించి బుక్ చేసుకున్న వారికి కార్గో విభాగం హోమ్ డెలివరీ చేస్తుందని వివరించారు. మరిన్ని వివరాలకు ఉమ్మడి జిల్లాలోని బస్ డిపోలను సంప్రదించాలని కోరారు. 

News March 15, 2025

నిర్మల్‌: పరీక్షలో 151 మంది విద్యార్థుల గైర్హాజరు

image

నిర్మల్ జిల్లాలోని 23 పరీక్ష కేంద్రాల్లో శనివారం నిర్వహించిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షకు 151 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఐఈఓ పరుశురాం తెలిపారు. మొత్తం 5,559 మంది విద్యార్థులకు గానూ 5,408 మంది పరీక్షకు హాజరైనట్లు వెల్లడించారు.

error: Content is protected !!