News February 14, 2026

పెద్దపల్లి జిల్లాలో ‘సింహ గర్జన’

image

పెద్దపల్లి జిల్లాలో జరిగిన పుర పోరులో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు ఘన విజయం సాధించారు. మొత్తం 64 స్థానాలలో పోటీ చేయగా.. 13 స్థానాలలో విజయం సాధించారు. రామగుండంలో 35 స్థానాలలో పోటీ చేసి 13 స్థానాలలో గెలిచారు. పెద్దపల్లిలో 5 (23) స్థానాలలో, సుల్తానాబాద్ లో 1 స్థానం (5), మంథనిలో 1 స్థానంలో విజయం సాధించారు. దీంతో జిల్లాలో ‘సింహ గర్జన’ కొనసాగింది.

Similar News

News March 9, 2026

రేపు కదిరి తేరు.. రథం కదిలేది ఎప్పుడంటే?

image

కదిరి ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మరథోత్సవానికి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు ఉదయం 8:25 నుంచి 8:45 గంటల మధ్య శుభ మేష లగ్నంలో <<19334160>>రథం<<>> కదలనుందని వేదపండితులు తెలిపారు. భక్తజన సందోహం మధ్య గోవింద నామస్మరణతో కదిరి పురవీధులు మారుమోగనున్నాయి. ఈ చారిత్రక వేడుకను వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు భారీగా తరలివస్తున్నారు.

News March 9, 2026

ఖమ్మం: వ్యాపారం ముసుగులో ఖాకీ కుటుంబం మోసం

image

ఖమ్మం జిల్లాలో ఓ పోలీస్ అధికారి కుటుంబం స్నేహం పేరుతో ఓ యువకుడిని మత్తుకు బానిసగా మార్చి, రూ.3 కోట్ల విలువైన భూమిని కొల్లగొట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. వ్యాపార నష్టం సాకుతో, బెదిరింపులకు పాల్పడి కలెక్టరేట్ సమీపంలోని ఆస్తిని బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు సమాచారం. న్యాయం చేయాలని ఉన్నత అధికారులను బాధిత కుటుంబం కోరుతోంది. ఈ ఘటన పోలీస్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది.

News March 9, 2026

త్రిషకు సారీ చెప్పిన నటుడు పార్తీబన్

image

త్రిషను బయటకు రానివ్వకూడదంటూ తాను చేసిన <<19330179>>కామెంట్స్‌పై<<>> నటుడు, డైరెక్టర్ పార్తీబన్ విచారం వ్యక్తం చేశారు. ‘ఈవెంట్‌లో అంతా తప్పుగా జరిగింది. క్షమాపణ కోరడం తప్ప మరో మార్గం లేదు’ అని Xలో పోస్టు చేశారు. టీవీకే చీఫ్ విజయ్, త్రిష రిలేషన్ రూమర్స్ నేపథ్యంలో పార్తీబన్ చేసిన కామెంట్స్ వైరలైన విషయం తెలిసిందే. దీనిపై త్రిష కూడా <<19332584>>ఘాటుగా బదులివ్వడంతో<<>> ఆయన దిగి వచ్చారు.