News February 12, 2025
పెద్దపల్లి జిల్లాలో 140 ఎంపీటీసీ, 13 జడ్పీటీసీ స్థానాలు

పెద్దపల్లి జిల్లాలో MPTC, ZPTC ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 140 ఎంపీటీసీలు, 13 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. పెద్దపల్లిలో అత్యధికంగా 50,994 మంది, ఎలిగేడులోని అత్యల్పంగా 18,537 మంది ఓటర్లు ఉన్నారు. పెద్దపల్లి జిల్లాలో పురుషులు 2,03,366, మహిళలు 2,09,927, ఇతరులు 13 మంది, మొత్తం 4,13,306 మంది ఓటర్లు నమోదయ్యారు. మొత్తం 755 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.
Similar News
News December 5, 2025
MNCL: ఉపసంహరణ డెడ్ లైన్ రేపే.. అభ్యర్థులపై ఒత్తిడి..?

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పల్లె రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రెండో విడత సర్పంచ్, వార్డు స్థానాలకు నామినేషన్లు వేసిన అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి గడువు 6వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ముగియనుంది. దీంతో వివిధ పార్టీల ముఖ్య నాయకులు రంగంలోకి దిగి నామినేషన్లు వేసిన అభ్యర్థులను ఉపసంహరణకు ఒప్పించేందుకు బుజ్జగింపులు, బేరసారాలు చేస్తున్నారు. ఈ పరిణామాలతో పల్లె రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
News December 5, 2025
HYD: పునర్విభజనపై అభిప్రాయానికి సిద్ధమా?

గ్రేటర్లో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు విలీనం చేయడంతో ఇపుడు అధికారులు వార్డుల పునర్విభజనపై దృష్టి సారించారు. ఇందుకు సంబంధించి ప్రజాభిప్రాయాలను సేకరించనున్నారు. 2 రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోనున్నారు. ఇందుకు వారం గడువు ఇవ్వనున్నారు. ఆ తర్వాత పది రోజుల్లోపు డీలిమిటేషన్ ప్రక్రియను పూర్తిచేస్తారు. అప్పుడే అసలు ఎన్ని వార్డులు వచ్చే అవకాశముందనే విషయంపై క్లారిటీ వస్తుంది.
News December 5, 2025
HYD: ‘మెట్రో’ భూములు ఏమయ్యాయి?

మెట్రో రైలు నిర్మాణంలో భాగంగా గత ప్రభుత్వం మెట్రోకు 57 ఎకరాలను కేటాయించింది. మెట్రో అధికారులు మాత్రం కేవలం 18 ఎకరాలను మాత్రమే వినియోగించారు. మూసారంబాగ్, పంజాగుట్ట, ఎర్రమంజిల్, మాదాపూర్లో మాత్రమే మాల్స్ కట్టి మిగతా 39 ఎకరాలను వదిలేసింది. ఇప్పుడు ఈ స్థలాలను ఆడిటింగ్ అధికారులు పరిశీలిస్తున్నారు. అసలు ఆ భూములు ఏ పరిస్థితుల్లో ఉన్నాయి? ఎందుకు వాటిని వాడుకోలేదని తెలుసుకునే పనిలో పడ్డారు.


