News March 22, 2025
పెద్దపల్లి జిల్లాలో 2,150 ఎకరాల్లో పంట నష్టం: ఏడీఏ

పెద్దపల్లి జిల్లాలో శుక్రవారం సాయంత్రం కురిసిన భారీ వర్షాల కారణంగా మొత్తం పంట నష్టం వివరాలను ADA శ్రీనాథ్ తెలిపారు. ఈ మేరకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. 950 ఎకరాల్లో మొక్కజొన్న, 1200 ఎకరాల్లో వరి పంట నష్టపోయినట్టు తెలిపారు.
Similar News
News September 19, 2025
పాడేరు: గ్యాస్ అధిక ధరలకు విక్రయిస్తే డీలర్లపై చర్యలు

గ్యాస్ సిలిండర్ను కంపెనీ ఇచ్చిన రేట్ల కన్నా అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ డీలర్లను హెచ్చరించారు. గురువారం పాడేరులోని కలెక్టరేట్లో పౌర సరఫరాల అధికారులు, గ్యాస్ డీలర్లతో సమావేశం నిర్వహించారు. గ్యాస్కు అదనంగా వసూలు చేస్తున్నారని లబ్ధిదారుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు.
News September 19, 2025
హసన్పర్తి: గంజాయి రవాణాదారులకు పదేళ్ల జైలు

హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం మల్లారెడ్డిపల్లి శివారులో 2017లో గంజాయి రవాణా చేస్తున్న నలుగురికి 8 సంవత్సరాల తర్వాత పదేళ్ల జైలు శిక్ష పడింది. నేరం రుజువుకావడంతో, నిందితులైన లావుడ్య భద్రమ్మ, దుప్పటి మల్లయ్య, బొల్ల అయిలయ్య, దాసరి కుమారస్వామికి 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున జరిమానా విధిస్తూ జడ్జి అపర్ణాదేవి తీర్పునిచ్చారు.
News September 19, 2025
నల్గొండ: జిల్లాలో తగ్గిన వాహన రిజిస్ట్రేషన్లు

జిల్లాలో వాహన రిజిస్ట్రేషన్లు తగ్గుముఖం పట్టాయి. జులై, ఆగస్టు నెలల్లో రిజిస్ట్రేషన్ల సంఖ్య వెయ్యికి పైగా చేరాయి. కానీ సెప్టెంబర్లో మాత్రం వందల సంఖ్యలో మాత్రమే వాహనాల రిజిస్ట్రేషన్లు అయ్యాయి. కార్లు, బైక్లపై కేంద్రం విధించే జీఎస్టీని తగ్గిస్తున్నామని, ఈ నిర్ణయం ఈ నెల 22 నుంచి అమల్లోకి వస్తుందని ఆగస్టు నెలాఖరులో కేంద్రం ప్రకటించింది. దీంతో వాహనప్రియులు తమ వాహనాల బుకింగ్లను వాయిదా వేసుకున్నారు.