News March 15, 2025
పెద్దపల్లి జిల్లాలో 40℃ డిగ్రీలు దాటుతున్న ఎండ తీవ్రత

పెద్దపల్లి జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు 40℃ డిగ్రీలు దాటుతున్నాయి. వేసవి నేపథ్యంలో ఎండ తీవ్రస్థాయికి చేరుకుంది. ఇక 10 దాటితే ఎండ తీవ్రత పెరుగుతుంది. వ్యవసాయదారులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. గడిచిన 24 గంటల్లో ముత్తారం మండల కేంద్రంలో 40.6℃ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో 20.1℃ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరి మీ ఏరియాలో ఎండ తీవ్రత పై మీ కామెంట్..?
Similar News
News November 14, 2025
NGKL: మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోండి

జిల్లాలో మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ (NMMS) కోసం ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ శుక్రవారం సాయంత్రం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న ప్రభుత్వ జిల్లా పరిషత్, ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు ఈ నెల 23న ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మెరిట్ పరీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. హాల్ టికెట్లు ఈనెల 15 నుంచి జారీ చేస్తామన్నారు.
News November 14, 2025
పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించాలి

జిల్లాలో పెద్ద ఎత్తున వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాలను నిర్వహించాలని జేసి రాహుల్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రతి నెల 3వ శనివారం పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వ సంస్థలలో స్వచ్ఛ ఆంధ్ర దినోత్సవంగా పాటించాలన్నారు. వ్యక్తిగత, సమాజ పరిశుభ్రత కార్యక్రమాలను జిల్లా అంతట విస్తృతంగా నిర్వహించాలన్నారు.
News November 14, 2025
కల్లెడలో పట్టపగలే భారీ చోరీ..!

వరంగల్ జిల్లా పర్వతగిరి(M) కల్లెడ గ్రామంలో భారీ చోరీ జరిగింది. పట్టపగలే ఇంటి తాళాలు పగలగొట్టి ఆదొండ సాయిలు ఇంట్లో చోరీకి పాల్పడి రూ.6 లక్షల నగదు, 25 తులాల బంగారు వస్తువులను దుండగులు ఎత్తుకెళ్లినట్లు సమాచారం. బాధితుడు ఇచ్చిన సమాచారం మేరకు పర్వతగిరి సీఐ రాజగోపాల్ ఆధ్వర్యంలో ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు విచారణ చేపట్టారు. పట్టపగలే భారీ చోరీ జరగడంతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.


