News February 4, 2025
పెద్దపల్లి జిల్లా.. ఉష్ణోగ్రతల వివరాలు

పెద్దపల్లి జిల్లాలో రోజురోజుకు చలి తీవ్రత తగ్గముఖం పడుతుంది. గడిచిన 24 గంటల్లో అత్యల్పంగా కాల్వ శ్రీరాంపూర్‌లో 17.5℃, ఓదెల 17.5, జూలపల్లి 17.5, సుల్తానాబాద్ 17.7, ఎలిగేడు 17.7, రామగుండం 17.8, అంతర్గాం 17.9, మంథని 18.0, కమాన్‌పూర్ 18.3, ధర్మారం 18.3, పెద్దపల్లి 18.6, పాలకుర్తి 18.6, రామగిరి 20.2, ముత్తారం 21.8℃గా నమోదయ్యాయి.
Similar News
News October 25, 2025
జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండండి: నంద్యాల కలెక్టర్

నంద్యాల జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాజకుమారి గణియా పేర్కొన్నారు. తుఫాన్ నేపథ్యంలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో నంద్యాల జిల్లాకు భారీ వర్ష సూచన ఉన్నట్లు తెలిపారు. వాగులు, వంతెనలు దాటే ప్రయత్నం చేయొద్దని, మొక్కజొన్న పంట కోతను వాయిదా వేసుకోవాలని, రైతులు పంటలను జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. పురాతన మట్టి మిద్దెల కింద నివాసం ఉండొద్దని సూచించారు.
News October 25, 2025
ఇంటి చిట్కాలు

* 4 టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడాలో 1 వంతు గోరువెచ్చని నీళ్లు పోసి క్లీనర్ రెడీ చేసుకోవాలి. దీంతో ఫ్రిజ్, వాషింగ్ మెషిన్, ఫ్యాన్లు, ఏసీలపై మరకలు సులువుగా పోతాయి
* క్యాస్ట్ ఐరన్ కుక్‌వేర్‌ను స్టీలు స్క్రబ్బర్‌తో గట్టిగా తోమితే కుక్వేర్ పొర పోవచ్చు. వీటిని స్పాంజ్ స్క్రబ్బర్‌తో మైల్డ్ డిష్ సోప్ ఉపయోగించి తోమాలి.
* షవర్ జామ్ అయితే కాస్త వెనిగర్, నీళ్లు కలిపి దానికి పట్టేలా రాసి, గంట తర్వాత కడిగేయాలి.
News October 25, 2025
బాలానగర్‌లో మురుగు కాలువలో శిశువు మృతదేహం

మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో దారుణం జరిగింది. భవాని మాత ఆలయం సమీపంలోని మురుగు కాలువలో గురువారం సాయంత్రం అప్పుడే పుట్టిన శిశువు మృతదేహం కవర్లో లభ్యమైంది. పంచాయతీ సిబ్బంది సమాచారంతో ఎస్ఐ లెనిన్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎస్ఐ తెలిపారు.


