News January 30, 2025
పెద్దపల్లి జిల్లా ఉష్ణోగ్రత వివరాలు

పెద్దపల్లి జిల్లాలో చలి తీవ్రత కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో అత్యల్పంగా జూలపల్లి 17.6 ℃, రామగుండం 17.8, పెద్దపల్లి 17.9, సుల్తానాబాద్ 18.0, ఓదెల 18.0, ఎలిగేడు 18.2, అంతర్గాం 18.2, కాల్వ శ్రీరాంపూర్ 18.5, పాలకుర్తి 18.6, మంథని 19.1, రామగిరి 20.1, కమాన్పూర్ 20.2, ధర్మారం 20.5, ముత్తారం 21.8℃ గా నమోదైంది.
Similar News
News July 11, 2025
జిల్లాలో స్వచ్ఛ సర్వేక్షణ కేంద్రం బృందాలు పర్యటన: కలెక్టర్

స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా జిల్లాలో ఉత్తమ గ్రామాలు ఎంపికలో భాగంగా కేంద్రం నుంచి అకాడమీ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ (AMS )బృందాలు జిల్లాలో పర్యటించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. గురువారం సాయంత్రం జిల్లా అధికారులతో కేంద్ర ఏఎంఎస్ బృంద సభ్యులు ఏలూరులో కలెక్టర్‌ను కలిశారు. రోజుకు 2 గ్రామాల చొప్పున 36 గ్రామాలలో పర్యటిస్తారని తెలిపారు.
News July 11, 2025
KNR: RTC DMలతో RM సమీక్షా సమావేశం

KNR రీజియన్ పరిధిలోని డిప్యూటీ RMలు ఎస్. భూపతిరెడ్డి, పి.మల్లేశం, 11 మంది డిపో మేనేజర్లతో RM బి.రాజు KNR బస్ స్టేషన్ ఆవరణలోని సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 2025-26 ఆర్థిక సం. ప్రథమ త్రైమాసికంలో రీజియన్ లోని అన్ని డిపోల పనితీరు పై సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రయాణీకులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఎల్లవేళలా తగినన్ని బస్సులు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు.
News July 11, 2025
మంగనూరు గ్రామానికి నేడు వైస్ ఛాన్స్‌లర్ రాక

బిజినేపల్లి మండలంలోని మంగనూరులో విద్య విధానంపై సమ్మేళనం జరగనున్నది. ఈ కార్యక్రమానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి.నిత్యానందరావు హాజరవుతున్నట్లు విజ్ఞాన వేదిక నిర్వాహకులు బోట్క కొండయ్య తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో సమ్మేళనం జరుగనుంది. గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగులు, ప్రొఫెసర్లు సమావేశానికి హాజరవుతారని ఆయన పేర్కొన్నారు.