News February 4, 2025

పెద్దపల్లి జిల్లా.. ఉష్ణోగ్రతల వివరాలు

image

పెద్దపల్లి జిల్లాలో రోజురోజుకు చలి తీవ్రత తగ్గముఖం పడుతుంది. గడిచిన 24 గంటల్లో అత్యల్పంగా కాల్వ శ్రీరాంపూర్‌లో 17.5℃, ఓదెల 17.5, జూలపల్లి 17.5, సుల్తానాబాద్ 17.7, ఎలిగేడు 17.7, రామగుండం 17.8, అంతర్గాం 17.9, మంథని 18.0, కమాన్పూర్ 18.3, ధర్మారం 18.3, పెద్దపల్లి 18.6, పాలకుర్తి 18.6, రామగిరి 20.2, ముత్తారం 21.8℃గా నమోదయ్యాయి.

Similar News

News January 16, 2026

జగిత్యాల: ఈనెల 28 నుంచి దరఖాస్తుల స్వీకరణ

image

జగిత్యాల జిల్లాలోని 13 మోడల్ స్కూళ్లలో 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాల కోసం ఈనెల 28 నుంచి వచ్చే నెల 28వ తేది వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు డీఈవో రాము శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలని పేర్కొన్నారు. ప్రవేశ పరీక్షను ఏప్రిల్ 19న నిర్వహిస్తామన్నారు. ఆసక్తి గల విద్యార్థులు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

News January 16, 2026

ఏపీకి 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి: లోకేశ్

image

AP: రాష్ట్రానికి 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి రానుందని మంత్రి లోకేశ్ ప్రకటించారు. ‘AM గ్రీన్’ కంపెనీ కాకినాడలో 1.5 మెట్రిక్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఎక్స్‌పోర్ట్ టర్మినల్ ఏర్పాటు చేయబోతుందని, దీనివల్ల 8వేల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయని ట్వీట్ చేశారు. ఇక్కడ ఉత్పత్తి అయిన అమ్మోనియాను జపాన్, జర్మనీ, సింగపూర్‌కు ఎగుమతి చేస్తారని పేర్కొన్నారు.

News January 16, 2026

భూపాలపల్లి: మైనారిటీ గురుకులంలో ప్రవేశాల పోస్టర్ ఆవిష్కరణ

image

భూపాలపల్లి మైనారిటీ గురుకులంలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల పోస్టర్‌ను కలెక్టర్ రాహుల్ శర్మ ఆవిష్కరించారు.5వ తరగతి,ఇంటర్ ప్రథమ సంవత్సరంతో పాటు 6,7,8వతరగతుల్లోని మిగులు సీట్ల కోసం FEB 28లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.ఉత్తమ బోధనతోపాటు IIT/NEET శిక్షణ ఇస్తారన్నారు. ఈ కార్యక్రమంలొ ప్రిన్సిపల్ రవి తదితరులు పాల్గొన్నారు.