News February 19, 2025

పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌తో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ 

image

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ప్రభుత్వ కార్యక్రమాలపై మంగళవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, అదనపు కలెక్టర్లు జే.అరుణశ్రీ, డి.వేణులతో కలిసి సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు. ప్రభుత్వ లక్ష్యాలను అధికారులు కట్టుదిట్టంగా అమలు చేయాలని శాంతి కుమారి ఆదేశించారు. 

Similar News

News March 22, 2025

కేకేఆర్ టీమ్‌కు షారుఖ్ ఖాన్ సందేశం

image

ఈరోజు తొలిమ్యాచ్ ఆడనున్న డిఫెండింగ్ ఛాంపియన్స్ KKRకు ఆ జట్టు యజమాని షారుఖ్ డ్రెస్సింగ్ రూమ్‌లో ప్రత్యేక సందేశాన్ని ఇచ్చారు. ‘మీ అందరిపై దేవుడి కరుణ ఉండాలి. ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలి. మిమ్మల్ని చక్కగా చూసుకుంటున్న చంద్రకాంత్ గారికి థాంక్స్. కొత్తగా జట్టులో చేరిన వారికి వెల్‌కమ్. ఈ సీజన్‌లో మనల్ని నడిపించనున్న అజింక్యకు ధన్యవాదాలు. మీ అందరికీ ఈ టీమ్ ఇల్లులా మారుతుందని ఆశిస్తున్నా’ అని అన్నారు.

News March 22, 2025

ఎర్త్ అవర్ విధిగా పాటించండి: గవర్నర్

image

నేడు రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు అనవసరమైన లైట్లను స్వచ్ఛందంగా ఆపివేసి ఎర్త్ అవర్ విధిగా పాటించాలంటూ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ ప్రజానీకానికి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన విజయవాడలోని రాజ్‌భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. “వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్” పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహించాలని గవర్నర్ సూచించారు.

News March 22, 2025

నిర్మల్: ఇంటి వద్దకే రాముల వారి తలంబ్రాలు

image

ఏప్రిల్ 6న శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రిలో జరగనున్న సీతారామచంద్రస్వామి కళ్యాణంలో వినియోగించిన తలంబ్రాలను ఆర్టీసీ కార్గో ద్వారా అందించనున్నట్లు డిపో మేనేజర్ పండరి తెలిపారు. శనివారం పోస్టర్లు ఆవిష్కరించి మాట్లాడారు. భద్రాచలం వెళ్లలేని భక్తులు బస్టాండ్‌లో ఏర్పాటుచేసిన కౌంటర్లో రూ.151 చెల్లిస్తే వారి ఇంటి వద్దకే తలంబ్రాలను పంపిస్తామన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

error: Content is protected !!