News October 4, 2024
పెద్దపల్లి: టెన్త్ విద్యార్థి మృతి

పెద్దపల్లి జిల్లాలో విషాదం నెలకొంది. కుటుంబీకుల ప్రకారం.. పాలకుర్తి మండలం ఈశాల తక్కల్లపల్లి గ్రామానికి చెందిన కంటే చిన్నా(15) అనే పదో తరగతి విద్యార్థి వైరల్ ఫీవర్తో శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందాడు. అయితే గత పదిరోజులుగా చిన్నా జ్వరంతో బాధపడుతున్నాడు. రెండు రోజుల నుంచి జ్వరం విషమించడంతో రెండు కిడ్నీల్లో ఇన్ఫెక్షన్ వచ్చి హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Similar News
News January 9, 2026
KNR: ‘ఉపాధి హామీకి కొత్త రూపం.. ‘వీబీ-జీ రామ్ జీ’గా బలోపేతం’

పాత ఎంజీఎన్ఆర్జీఏ చట్టాన్ని నీరుగార్చడం లేదని, దానికి మరిన్ని సంస్కరణలు అద్ది ‘వీబీ-జీ రామ్ జీ’ (వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్) చట్టంగా కేంద్రం బలోపేతం చేసిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరవెల్లి రఘునాథ్ స్పష్టం చేశారు. కరీంనగర్లో జరిగిన బీజేపీ జిల్లా కార్యశాలలో ఆయన మాట్లాడుతూ, పని దినాలను 100 నుంచి 125 రోజులకు పెంచిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనన్నారు.
News January 9, 2026
KNR: స్కూళ్లలో ‘ఫిర్యాదుల పెట్టె’.. వేధింపులకు ఇక చెక్!

పాఠశాల విద్యార్థుల రక్షణే ధ్యేయంగా కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి చేపట్టిన ‘ఫిర్యాదుల పెట్టె’ ఆలోచన ఆదర్శనీయంగా నిలుస్తోంది. బొమ్మకల్ హైస్కూల్లో ఈ పెట్టెను ఆమె స్వయంగా పరిశీలించారు. వేధింపులు, సమస్యలు ఎదురైతే విద్యార్థులు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని కోరారు. మహిళా పోలీసుల పర్యవేక్షణలో వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని భరోసానిచ్చారు. కలెక్టర్ అద్భుతమైన చొరవపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
News January 9, 2026
రామడుగు కేజీబీవీలో కలెక్టర్ తనిఖీ

రామడుగు మండలం వెదిర కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆకస్మికంగా సందర్శించారు. వంటగది, తరగతి గదులను తనిఖీ చేసిన ఆమె.. ప్రభుత్వ మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, శుద్ధజలం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పదో తరగతి విద్యార్థులు పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు.


