News January 24, 2025

పెద్దపల్లి: ట్రాఫిక్ పోలీసుల వినూత్న కార్యక్రమం

image

పెద్దపల్లి ట్రాఫిక్ CIఅనిల్ కుమార్ ఆధ్వర్యంలో పట్టణంలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. రోడ్డుపై తిరుగుతున్న పశువుల కొమ్మలకు, మెడకు రేడియో స్టిక్కర్లను ఏర్పాటు చేశారు. రోడ్లపై తిరుగుతున్న పశువులు రాత్రివేళలో తరచూ ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు CIతెలిపారు. అంతేకాకుండా వాహనదారులకు ప్రమాదాలు జరగకుండా ఉంటుందన్నారు.

Similar News

News November 5, 2025

జగిత్యాల: విచిత్ర ఘటన.. నెల రోజుల్లో ఏడుసార్లు కాటేసిన పాము

image

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం బొంకూరు గ్రామంలో డ్రైవర్‌గా పనిచేసుకుంటూ జీవనం సాగించే 28 ఏళ్ల యువకుడిని గత నెలలో పాము కాటు వేసింది. వెంటనే చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే మరోసారి కాటేయడంతో ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని ఇంటికి రాగానే మళ్లీ కాటు వేసింది. ఇలా నెలరోజుల వ్యవధిలో ఒకే వ్యక్తికి ఏడుసార్లు పాము కాటు వేయడంతో పాము పగ పట్టినట్టు ఉందని కుటుంబ సభ్యులు భయాందోళన చెందుతున్నారు.

News November 5, 2025

గుంటూరు: ‘ప్రైవేట్ కాలేజీల నిర్లక్ష్యంపై చర్యలేవి’

image

రాజధాని అమరావతిలోని ప్రైవేట్ కాలేజీలో ఫుడ్ పాయిజన్ కేసులు పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలేజీలలో నిల్వ ఉంచిన ఆహారాన్ని విద్యార్థులకు పెట్టడంతో విద్యార్థుల ప్రాణాలు పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. రాజధానిలో ప్రైవేట్ కాలేజీల నిర్లక్ష్యంపై ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

News November 5, 2025

OFFICIAL: కమల్ ప్రొడక్షన్‌లో రజినీ సినిమా

image

తమిళ సినీ దిగ్గజాలు రజినీకాంత్, కమల్ హాసన్ ఓ సినిమా కోసం చేతులు కలిపారు. కమల్ నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌లో రజినీకాంత్ హీరోగా ఈ మూవీ తెరకెక్కనుంది. దీనికి సి.సుందర్ దర్శకత్వం వహించనున్నారు. సూపర్ స్టార్‌కు 173వ సినిమా ఇది. ఈ మూవీని 2027 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు కమల్ హాసన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.