News February 23, 2025

పెద్దపల్లి: తండ్రిని చంపిన కొడుకు

image

HYDకుషాయిగూడ PS పరిధిలో శనివారం కన్నతండ్రిని ఓ కొడుకు హత్యచేశాడు. PDPL(D) కాల్వశ్రీరాంపూర్(M) వెన్నంపల్లికి చెందిన అరెల్లి మొగిలి(45) జీవనోపాధి కోసం నగరానికి వలసవచ్చి లాలాపేటలో ఉంటున్నాడు. మద్యానికి బానిసైన మొగిలి నిత్యం తాగొచ్చి కుటుంబసభ్యులను డబ్బులకోసం వేధించసాగాడు. విసిగిపోయిన కొడుకు సాయికుమార్ తండ్రిని ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నాడు. ECIL బస్టాండ్ వద్ద అందరు చూస్తుండగానే నిన్న హత్యచేశాడు.

Similar News

News November 25, 2025

కాకినాడ: ప్రభుత్వ స్థలాల ఆక్రమణపై కలెక్టర్ హెచ్చరిక

image

కాకినాడ నగరంలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ షాన్‌మోహన్ హెచ్చరించారు. చీడీల పొర, బీచ్ రోడ్డులోని విముక్తి స్కూల్‌కు ఉత్తరం వైపున, గోడారిగుంటకు వెళ్లే దారిలో కొందరు ఆక్రమణలకు యత్నిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు. ఇటువంటి అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని కలెక్టర్ స్పష్టం చేశారు.

News November 25, 2025

రంపచోడవరం జిల్లాకు గ్రీన్ సిగ్నల్..?

image

YCP ప్రభుత్వంలో రంపచోడవరం, అరకు, పాడేరుతో అల్లూరి సీతారామరాజు జిల్లా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు జిల్లా కేంద్రమైన పాడేరుకు రావాలంటే వందలాది కిలో మీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంది. ఇక్కడి ప్రజలు రంపచోడవరం కేంద్రంగా కొత్త జిల్లా కావాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మంత్రివర్గ ఉపసంఘం సానుకూలంగా ఉంది. ఇవాళ సీఎం చంద్రబాబు దీనిపై సమీక్ష చేయనున్నారు.

News November 25, 2025

అనకాపల్లి జిల్లాలో కొత్త రెవెన్యూ డివిజన్‌

image

అనకాపల్లి జిల్లాలో కొత్తగా నక్కపల్లి రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు కానుంది. సోమవారం నాడు మంత్రివర్గ ఉప సంఘం నక్కపల్లిని రెవెన్యూ డివిజన్‌గా మార్పు చేస్తూ ఆమోదం తెలిపింది. త్వరలో పారిశ్రామికంగా నక్కపల్లిలో అనేక పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. రెవెన్యూ డివిజనల్ కేంద్రంగా మారితే డీఎస్పీ, ఆర్డీవో స్థాయి అధికారుల కార్యాలయాలు కూడా ఏర్పాటు అవుతాయి. ఈ నిర్ణయం పట్ల ప్రజలు హర్షం వెలిబుచ్చుతున్నారు.