News February 26, 2025

పెద్దపల్లి: తండ్రిని హత్య చేసిన కొడుకుకు యావజ్జీవం

image

తండ్రిని చంపిన కొడుకుకు కోర్టు యావజ్జీవం విధించింది. SI శ్రావణ్ తెలిపిన వివరాలు.. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కాచాపూర్ వాసి నర్సయ్య కుటుంబం సుల్తానాబాద్ పరిధి పూసాల గ్రామంలో నివాసం ఉంటోంది. అతడి పెద్దకొడుకు రాజేశం(40) 20 ఏళ్ల క్రితం హత్యాయత్నం కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు. కాగా 2023 DEC 8న క్షణికావేశంలో తండ్రిని చంపేశాడు. కోర్టు రాజేశానికి యావజ్జీవ శిక్షతో పాటు రూ. 5వేల జరిమానా విధించింది.

Similar News

News October 22, 2025

ప్రసూతి మరణంపై నివేదిక ఇవ్వండి: పవన్‌ కళ్యాణ్‌

image

చేబ్రోలుకు చెందిన దుర్గా ప్రసూతి మరణంపై తక్షణ నివేదిక ఇవ్వాలని డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ బుధవారం అధికారులను ఆదేశించారు. ఆయన కాకినాడ జిల్లా కలెక్టర్, పాడా పీడీలతో ఫోన్‌లో మాట్లాడారు. మెటర్నల్ డెత్‌లపై ఎప్పటికప్పుడు సోషల్ ఆడిట్ నిర్వహించాలని, ప్రసూతి సమయంలో వైద్య సేవలకు సంబంధించి వైద్యులను అప్రమత్తం చేయాలని డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ అధికారులను ఆదేశించారు.

News October 22, 2025

విజయనగరం జోన్‌లో 1400 మందికి ప్రమోషన్లు

image

APSRTCలో ప్రమోషన్ల ప్రక్రియ జాబితా విడుదల అయింది. విశాఖ జిల్లాలో 572 మందికి ప్రమోషన్లు జారీ కాగా మొత్తం విజయనగరం జోన్లో 1,400 మందికి ప్రమోషన్లు ఇస్తున్నట్లు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ అప్పలనాయుడు తెలిపారు. డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్స్, తదితర విభాగాల నుంచి సిబ్బందికి ప్రభుత్వం ప్రమోషన్లు కల్పించిందని వెల్లడించారు.

News October 22, 2025

భారీ వర్షాలపై మంత్రి గొట్టిపాటి సమీక్ష..!

image

భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ బుధవారం సీఎండీలు, వివిధ జిల్లాల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్ష ప్రభావిత ప్రాంతాలపై సమీక్షించారు. బాపట్ల జిల్లాలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు కూలితే వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు.