News February 26, 2025
పెద్దపల్లి: తండ్రిని హత్య చేసిన కొడుకుకు యావజ్జీవం

తండ్రిని చంపిన కొడుకుకు కోర్టు యావజ్జీవం విధించింది. SI శ్రావణ్ తెలిపిన వివరాలు.. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కాచాపూర్ వాసి నర్సయ్య కుటుంబం సుల్తానాబాద్ పరిధి పూసాల గ్రామంలో నివాసం ఉంటోంది. అతడి పెద్దకొడుకు రాజేశం(40) 20 ఏళ్ల క్రితం హత్యాయత్నం కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు. కాగా 2023 DEC 8న క్షణికావేశంలో తండ్రిని చంపేశాడు. కోర్టు రాజేశానికి యావజ్జీవ శిక్షతో పాటు రూ. 5వేల జరిమానా విధించింది.
Similar News
News March 24, 2025
కొండాపూర్: ఆంగ్లం పరీక్షకు 99.8% హాజరు

పదో తరగతి ఆంగ్లం పరీక్షకు 99.8% హాజరైనట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సోమవారం తెలిపారు. మొత్తం 22,406 మందికి 22,362 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. జిల్లా పరిశీలకురాలు ఉషారాణి ఐదు, డీఈవో వెంకటేశ్వర్లు మూడు, అసిస్టెంట్ కమిషనర్ పండరీ నాయక్ ఒక పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసినట్లు పేర్కొన్నారు.
News March 24, 2025
SKLM: గిరిజన రైతుల శ్రమకు జాతీయ గుర్తింపు

ఏపీలోని అరకు లోయ నుంచి వచ్చిన స్వచ్ఛమైన, జిఐ ట్యాగ్ పొందిన అరకు కాఫీ ఇప్పుడు పార్లమెంటు ప్రాంగణంలో లభిస్తోందని, 1.5 లక్షల మంది గిరిజన రైతుల కఠోర శ్రమకు, సంప్రదాయానికి ప్రతీకని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. పార్లమెంటులో అరకు కాఫీ అందుబాటులోకి తీసుకురావడానికి పీఎం నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు సహకారం ఎంతో గొప్పదని, వారిద్దరికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
News March 24, 2025
వారికి రుణమాఫీపై మాట్లాడే హక్కు లేదు: తుమ్మల

TG: ప్రతి రైతు కుటుంబానికి రూ.2లక్షల రుణమాఫీ చేస్తామన్నామని, రూ.20వేల కోట్లు రుణమాఫీ చేసి మాట నిలబెట్టుకున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతులను మోసం చేసిన పార్టీలకు దీనిపై మాట్లాడే హక్కు లేదని అసెంబ్లీలో MLA పాయల్ శంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. గత ప్రభుత్వం చేసిన రుణమాఫీ వడ్డీలకే సరిపోయిందని ఎద్దేవా చేశారు. రైతుభరోసా నిధులు ఈ నెలాఖరులో రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామన్నారు.