News February 26, 2025
పెద్దపల్లి: తండ్రిని హత్య చేసిన కొడుకుకు యావజ్జీవం

తండ్రిని చంపిన కొడుకుకు కోర్టు యావజ్జీవం విధించింది. SI శ్రావణ్ తెలిపిన వివరాలు.. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కాచాపూర్ వాసి నర్సయ్య కుటుంబం సుల్తానాబాద్ పరిధి పూసాల గ్రామంలో నివాసం ఉంటోంది. అతడి పెద్దకొడుకు రాజేశం(40) 20 ఏళ్ల క్రితం హత్యాయత్నం కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు. కాగా 2023 DEC 8న క్షణికావేశంలో తండ్రిని చంపేశాడు. కోర్టు రాజేశానికి యావజ్జీవ శిక్షతో పాటు రూ. 5వేల జరిమానా విధించింది.
Similar News
News March 20, 2025
వ్యాపారవేత్త ఆలోచనతో మహిళలు ముందుకు సాగాలి: కలెక్టర్

ఖమ్మం: సమాజంలో సమానత్వం రావాలంటే మహిళలు అన్ని రంగాలలో నైపుణ్య వ్యాపారం చేస్తూ ఆర్థిక బలం సాధిస్తే సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. గురువారం పెనుబల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణంలో ఉన్న మండల మహిళా సమాఖ్య భవనంలో ఉషోదయ, ఆదర్శ మహిళా సమాఖ్యలతో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. వ్యాపారవేత్త ఆలోచనా ధోరణితో మహిళలు ముందుకు సాగాలని పేర్కొన్నారు.
News March 20, 2025
ములుగు కలెక్టర్ కీలక ఆదేశాలు

ములుగు జిల్లాలో పదవ తరగతి పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్ అన్నారు. గురువారం పరీక్షల నిర్వహణ, విద్యాశాఖ సిబ్బందికి కలెక్టర్ పలు సూచనలు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని, ఇద్దరు పోలీస్ సిబ్బంది, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. పరీక్షలు పూర్తయ్యేంతవరకు ఎలాంటి కరెంటు కోతలు ఉండవద్దన్నారు.
News March 20, 2025
మంచిర్యాల: KC వేణుగోపాల్‌ను కలిసిన ఎంపీ వంశీ

పార్లమెంట్ కార్యాలయంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేసీ వేణుగోపాల్‌ను కలిసి బడ్జెట్, కుల గణన, ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు వంటి అంశాలపై చర్చించారు. ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాల అమలుపై మాట్లాడారు. రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలపై చర్చలు జరిపారు. కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.