News February 3, 2025
పెద్దపల్లి: తాటిచెట్టుపై నుంచి కింద పడ్డ గీతకార్మికుడు..

పెద్దపల్లి మండలం హనుమంతుని పేటలో వడ్లకొండ లక్ష్మయ్య అనే గీత కార్మికుడు ఆదివారం సాయంత్రం తాడిచెట్టు ఎక్కుతూ ప్రమాదవశాత్తు కింద పడి తీవ్ర గాయాల పాలయ్యాడు. దీంతో అతడిని పెద్దపల్లి సివిల్ హాస్పిటల్కు తరలించారు. లక్ష్మయ్యను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరారు.
Similar News
News December 7, 2025
ఎచ్చెర్ల : జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యుడిగా భాస్కరరావు

ముద్దాడ రేషన్ డిపో డీలర్ పగడ భాస్కరరావును జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యుడిగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ నియమిస్తూ ఉత్తర్వులు శనివారం జారీ చేశారు. పౌరసరఫరాల శాఖ రేషన్ డిపోలో పారదర్శకతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయనకు సూచించారు. తనకు అప్పగించిన బాధ్యత సమర్థవంతంగా చేస్తానని భాస్కర్ రావు తెలిపారు.
News December 7, 2025
పులివెందులలో YS జార్జిరెడ్డికి విజయమ్మ నివాళి.!

మాజీ ముఖ్యమంత్రి YSR సోదరుడు వైయస్ జార్జిరెడ్డి వర్ధంతి ఆదివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. వైయస్సార్ సమాధుల తోటలో వైయస్ జార్జిరెడ్డి సమాధితోపాటు రాజారెడ్డి, వివేకానందరెడ్డి సమాధుల వద్ద పూలమాలలు పెట్టి వైఎస్ విజయమ్మ, జార్జిరెడ్డి సతీమణి భారతమ్మ నివాళులర్పించారు. అనంతరం పులివెందులలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు.
News December 7, 2025
2,757 పోస్టులు.. దరఖాస్తుల ఆహ్వానం

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL)లో 2,757 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. BA, B.com, BSc, డిప్లొమా, టెన్త్, ITI, ఇంటర్ అర్హతగల వారు DEC18 వరకు NAPS/NATS పోర్టల్లో అప్లై చేసుకోవచ్చు. వయసు 18- 24ఏళ్ల మధ్య ఉండాలి. విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://iocl.com *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.


