News February 3, 2025

పెద్దపల్లి: తాటిచెట్టుపై నుంచి కింద పడ్డ గీతకార్మికుడు..

image

పెద్దపల్లి మండలం హనుమంతుని పేటలో వడ్లకొండ లక్ష్మయ్య అనే గీత కార్మికుడు ఆదివారం సాయంత్రం తాడిచెట్టు ఎక్కుతూ ప్రమాదవశాత్తు కింద పడి తీవ్ర గాయాల పాలయ్యాడు. దీంతో అతడిని పెద్దపల్లి సివిల్ హాస్పిటల్‌కు తరలించారు. లక్ష్మయ్యను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరారు.

Similar News

News January 23, 2026

శీతాకాలంలో పసిపిల్లల సంరక్షణ

image

శీతాకాలంలో నవజాత శిశువులను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. బిడ్డకు ఎప్పుడూ వెచ్చగా ఉండే దుస్తులు వేయాలి. సమయానికి తల్లిపాలు ఇవ్వడం చాలా ముఖ్యం. ఉదయం స్నానం చేయించిన తర్వాత బిడ్డను కాసేపు ఎండలో కూర్చోనివ్వాలి. చల్లని గాలి పడకుండా చూడాలి. ఫ్యాన్ లేదా ఏసీకి దూరంగా ఉంచాలి. ఏవైనా ఆరోగ్య సమస్యల లక్షణాలు కనిపిస్తే ఇంట్లో మందులు వేసి సొంత వైద్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

News January 23, 2026

నంద్యాల: ‘వచ్చే నెల 19 వరకు టైం ఉంది. అప్లై చేసుకోండి’

image

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా అధికారి శ్రీదేవి తెలిపారు. 5వ తరగతి, ఇంటర్మీడియట్ (ఆంగ్ల మాద్యమం) మొదటి సంవత్సరంలో చేరేందుకు అభ్యర్థులు https://apbragcet.apcfss.in/లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈనెల 20వ తేదీ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమైందని, వచ్చే నెల 19వ తేదీ వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు.

News January 23, 2026

కర్నూలు: ‘వచ్చే నెల 19 వరకు టైం ఉంది. అప్లై చేసుకోండి’