News April 4, 2025

పెద్దపల్లి: దరఖాస్తుల గడువు పొడగింపు

image

రాజీవ్ యువ వికాసం పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 14 వరకు గడువు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. రాజీవ్ యువ వికాసం పథకం కింద దరఖాస్తులను ఆఫ్ లైన్‌లో సంబంధిత మండల పరిషత్ కార్యాలయం లేదా మున్సిపల్ కార్యాలయంలో ప్రజాపాలన కౌంటర్ నందు దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆసక్తిగల యువకులు నిర్ణిత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Similar News

News December 24, 2025

లోదుస్తులు ఎలా ఉండాలంటే..

image

అందరూ దుస్తులపై చాలా ఖర్చు చేస్తారు. కానీ లో దుస్తులను అంతగా పట్టించుకోరు. ముఖ్యంగా మహిళలు నిత్యం ధరించే బ్రా సరిగ్గా ఎంచుకోవాలి. బ్రాల చుట్టూ ఉండే పట్టీ మరీ వదులుగా, మరీ బిగుతుగా ఉండకూడదు. పక్కటెముక మీద ఆ ఒత్తిడి లేకుండా చూడాలి. సరైన బ్రా, కప్ సైజ్‌నే వాడాలి. బ్రా లోపల వాడే వైర్‌ గుచ్చుకోకుండా, చర్మం మీద నొక్కుకోకుండా చూసుకోవాలి. స్ట్రాప్స్‌ శరీరాకృతిని బట్టి సరిచేసుకోగలిగే వెసులుబాటు ఉండాలి.

News December 24, 2025

BBJCCLలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

కోల్‌కతాలోని బ్రేత్ వేట్ బర్న్ అండ్ జేసప్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్(<>BBJCCL<<>>) 21 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు జనవరి 3 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిప్లొమా/బీటెక్/BE, MBA, PGDBM ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://bbjconst.com

News December 24, 2025

అంటే.. ఏంటి?: Triumph

image

ఈ పదం గ్రీకు భాషలో మొదలై మూడు భాషల పరిణామంతో ఇంగ్లిష్‌లోకి వచ్చింది. గ్రీకు భాషలో Thriambos పదం నుంచి లాటిన్‌లోకి triumphusగా మార్చబడింది. దాన్నుంచి పురాతన ఫ్రెంచ్‌లో triumpheగా రూపాంతరం చెంది ఇంగ్లిష్‌లో Triumphగా స్థిరపడింది. ఈ పదం అర్థం ఘన విజయం.
-రోజూ 12pmకు అంటే.. ఏంటి?లో ఓ కొత్త పదం గురించి తెలుసుకుందాం.
<<-se>>#AnteEnti<<>>