News April 12, 2025

పెద్దపల్లి: దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక కౌంటర్: కమిషనర్

image

నిరుద్యోగ యువతీ యువకులకు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న రాజీవ్ యువవికాసం పథకం కింద సబ్సిడీ రుణాల కోసం మీసేవ ద్వారా ఆన్లైన్ దరఖాస్తులను 12, 13, 14 తేదీల్లో స్వీకరిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ తెలిపారు. ఈ 3 రోజుల పాటు పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో ప్రజాపాలన సేవ కేంద్రం కౌంటర్ అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Similar News

News October 18, 2025

KNR: ‘చట్టాలపై అవగాహన అవసరం’

image

తిమ్మాపూర్ మండలంలోని డైట్ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా సీనియర్ సివిల్ జడ్జి కే. వెంకటేష్ మాట్లాడుతూ, న్యాయ విజ్ఞాన సదస్సుల ద్వారా ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. మోటార్ వెహికల్ చట్టం, బాల్య వివాహాల నిరోధక చట్టం, పోక్సో యాక్ట్ వంటి చట్టాలపై ఆయన అవగాహన కల్పించారు. సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా మెలగాలని ఆయన సూచించారు.

News October 18, 2025

ఇవాళ ఒక్కరోజే 23వేల అప్లికేషన్లు

image

TG: లిక్కర్ షాప్స్‌కు ఈరోజు రికార్డు స్థాయిలో అప్లికేషన్స్ వచ్చాయని ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఇవాళ ఒక్కరోజే 23 వేల దరఖాస్తులు వచ్చాయని, ఇప్పటివరకు మొత్తం 50వేలు దాటాయని పేర్కొంది. శనివారం చివరి రోజు కావడంతో మరో 50 వేలు అప్లికేషన్స్ వస్తాయని అంచనా వేస్తోంది. కాగా రాష్ట్రంలో 2,620 మద్యం షాపులకు దరఖాస్తులు స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే.

News October 18, 2025

కండ్లపల్లి చెరువు కట్ట పరిశీలన.. డ్యామ్ సేఫ్టీ అధికారుల తనిఖీ

image

జగిత్యాల శివారులోని కండ్లపల్లి చెరువు కట్ట ఇటీవల కుంగిపోయి ప్రమాదకరంగా మారిన నేపథ్యంలో డ్యామ్ సేఫ్టీ అధికారులు శుక్రవారం కట్టను పరిశీలించారు. చెరువు కట్ట మరమ్మతులకు సంబంధించి తక్షణం చేపట్టవలసిన పనులను సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులకు వారు సూచించారు. ఈ తనిఖీలో విశ్రాంత ఎన్‌సీ రామరాజు, సేఫ్టీ అధికారిణి విజయలక్ష్మి, నీటిపారుదల శాఖ ఈఈ ఖాన్, జియాలజిస్ట్ పద్మరాజు పాల్గొన్నారు.